మహేష్ బాబు మరోసారి వెలిగిపోయాడు. ఆయన కథానాయకుడిగా నటించిన `శ్రీమంతుడు` చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రి ప్రత్యేకంగా వీక్షించారు. అద్భుతమైన సినిమా అంటూ మహేష్ కి ట్విట్టర్ ద్వారా కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. ఊరికి తిరిగి ఇచ్చేయాలన్న కాన్సెప్ట్ చాలా బాగుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ విలేజ్ - స్మార్ట్ వార్డ్స్ కార్యక్రమాల్నే అందుకు వేదికగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నుంచే తన సినిమాకి అభినందనలొచ్చేసరికి మహేష్ బాబు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. మొదట్నుంచీ `శ్రీమంతుడు` చిత్రబృందం తమ సినిమాని ప్రజాప్రతినిధులకి చూపించాలని అనుకొంటూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి చూపించాలని మహేష్ బాబు బావ జయదేవ్ గల్లా ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. బాబు తీరిక చేసుకొని ఆదివారం రాత్రి సినిమా చూశాడు. తన సినిమాని మెచ్చుకొన్నందుకు మహేష్ కూడా ట్విట్టర్ ద్వారా బాబుకి కృతజ్ఞతలు చెప్పాడు.
ఇటీవలకాలంలో ఎంత మంచి సినిమా తీసినా సరే బాక్సాఫీసు దగ్గర రెండు మూడు వారాల కంటే ఎక్కువ రోజులు నిలబడే పరిస్థితులు లేవు. ఆయా వీకెండ్స్‌లో వచ్చిన వసూళ్లే సినిమా జయాపజయాల్ని నిర్దేశిస్తుంటాయి. అయితే `బాహుబలి` మాత్రం కొన్నిచోట్ల ఇదివరకటి తరహాలోనే బాక్సాఫీసు దగ్గర స్థిరంగా నిలబడింది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే కొన్నిచోట్ల మాత్రం ఇతరత్రా సినిమాల్లాగే అభిమానులు డబ్బులు కట్టి మరీ ఎక్కువ రోజులు ఆడించాలని ప్రయత్నం చేశారు. అలాంటి పనులు అస్సలు చేయొద్దంటూ సాక్షాత్తు దర్శకుడు రాజమౌళి వారించారు. దీంతో ప్రభాస్ అభిమానులు వెనక్కితగ్గారు. ఇప్పుడు చాలా చోట్ల `బాహుబలి` మంచి వసూళ్లతో స్వచ్ఛందంగా ఆడుతోంది. ఆ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ మధ్య విడుదలైన మహేష్ బాబు `శ్రీమంతుడు` కూడా చాలా చోట్ల స్థిరంగా ఆడుతోంది. అందుకే కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టే సమయం వచ్చినా మహేష్ బాబు తన `శ్రీమంతుడు`ని ప్రమోట్ చేయడం ఆపడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా చూసి అభినందించడంతో ఆ సినిమా మరికొన్ని రోజులు బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తుందనండంలో ఎంత మాత్రం సందేహం లేదు.