ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగా ప్రమోట్ చేసి జనాలకు చేరువ చేయడం ముఖ్యం. అందులోనూ చిన్న సినిమాలకు ఇది చాలా అవసరం. ఐతే ఈ శుక్రవారం విడుదల కాబోయే ‘మనమంతా’ సినిమాకు ప్రమోషన్ అనుకున్న స్థాయిలో చేయలేదు. కేవలం ప్రకటనలు ఇచ్చి వదిలేశారు తప్పితే.. సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలేమీ లేవు. ఒక ప్రెస్ మీట్ లేదు. ఆడియో వేడుక లేదు. యేలేటి మీద ప్రేక్షకులకు ఉన్న గురి వల్ల.. మోహన్ లాల్ నటించడం వల్ల.. టీజర్-ట్రైలర్ బాగుండటం వల్ల సినిమా మీద పాజిటివ్ బజ్ ఉంది కానీ.. సినిమాపై మరింత ఆసక్తి పెంచే అవకాశం ఉండి కూడా అలాంటి ప్రయత్నమేమీ చేయలేదు.
యేలేటి ఎప్పుడూ తెర వెనుకే ఉండిపోతాడు. తన సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడడు. అలాంటి వాళ్లు మాట్లాడితే వినాలని జనాలకు అనిపిస్తుంది. ఇంతకుముందైతే దర్శకులు మాట్లాడకున్నా చెల్లిపోయేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాట్లాడక తప్పదు. రాఘవేంద్రరావు.. వంశీ లాంటి వాళ్లే తమ చుట్టూ గీసుకున్న మౌన హద్దులు దాటుకుని బయటికి వచ్చేశారు. ఇక యేలేటి మాత్రం అలా సైలెంటుగా ఉండిపోతే ఎలా? అసలు ఈ సినిమాకు ఆడియో వేడుక ఎందుకు చేయలేదో అర్థం కాలేదు. యేలేటి.. మోహన్ లాల్ లాంటి వాళ్లు సినిమా గురించి నాలుగు మాటలు మాట్లాడితే అది కచ్చితంగా ప్లస్ అయ్యేది. మరి నిర్మాత సాయి కొర్రపాటి ఉద్దేశమేంటో..? సినిమా మీద బాగా కాన్ఫిడెన్స్ ఉండటంతో.. తాము మాట్లాడాల్సిన పని లేదని.. సినిమానే మాట్లాడుతుందని భరోసాతో ఇలా చేశారేమో. ‘మనమంతా’కు ఎలాంటి టాక్ వస్తుందో చూద్దాం మరి.