అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' పేరుతో ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుండగా.. రెండో భాగం వచ్చే ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో బన్నీ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ''ఐకాన్'' సినిమా పూర్తి చేయనున్నాడు.
'ఐకాన్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించనున్నారు. ‘కనుబడుట లేదు’ అనేది దీనికి ఉపశీర్షిక. అప్పుడెప్పుడో ప్రకటించబడిన ఈ ప్రాజెక్ట్ సజీవంగా ఉన్నట్లు ఇటీవలే క్లారిటీ వచ్చింది. 'పుష్ప 1' తర్వాత అల్లు అర్జున్ నుంచి వచ్చే సినిమా కావడంతో.. పాన్ ఇండియాకు తగ్గట్టుగా ఐకాన్ స్క్రిప్ట్ లో కీలక మార్పులు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
'ఐకాన్' చిత్రంలో పూజాహెగ్డే - కృతి శెట్టి లను హీరోయిన్లుగా తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ ప్రకారం పూజా రోల్ కంటే కృతి శెట్టి క్యారక్టర్ కు కాస్త ప్రాధాన్యత ఎక్కువగా ఉందట. ఈ విషయంలో కూడా కొన్ని చేంజెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వేణు శ్రీరామ్ కథలో మార్పులు చేర్పులు చేసిన తర్వాత బన్నీ మరోసారి ఫైనల్ స్క్రిప్ట్ ని వినబోతున్నాడని తెలుస్తోంది.
ఇదిలా వుండగా అగ్ర దర్శకులు కొరటాల శివ - బోయపాటి శ్రీను - ఏఆర్ మురుగదాస్ - ప్రశాంత్ నీల్ లతో అల్లు అర్జున్ తదుపరి సినిమాలు రూపొందనున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి చిత్రం ఆర్డర్ లో కాస్త ముందుంటుందని టాక్. 'పుష్ప: ది రైజ్' సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ లైనప్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా, 'పుష్ప: ది రైజ్' చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నీ మాస్ లుక్ లో దర్శనమిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2021 క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.