అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప''. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటుగా ఇతర భాషల్లోనూ మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్న బన్నీ.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. దక్షిణాదికి చెందిన నాలుగు ప్రధాన భాషలతో పాటు హిందీలోనూ ఏకకాలంలో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో షూటింగ్ చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ టైమ్ పెరిగే అవకాశం ఉండటంతో నిర్మాతలు సినిమా బడ్జెట్ లో మార్పులు చేసే పనిలో ఉన్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
'పుష్ప' సినిమాకు సంబంధించి కొంత కాస్ట్ కట్టింగ్ తో పాటుగా సుకుమార్ ఆధ్వర్యంలో కొన్ని షూటింగ్ లోకేషన్స్.. వాటి ఖర్చులను మార్చే పనిలో మైత్రీ టీమ్ ఉందని టాక్ వినిపిస్తోంది. నిర్మాతలు ఇప్పటి వరకు సుకుమార్ కి 35 కోట్లు ఇచ్చారట. అయితే ఇది కాకుండా ఈ బ్యానర్ వారు సుక్కూ తో కలసి చేసిన 'ఉప్పెన' సినిమా నుంచి కూడా కొంత వాటా రావాల్సి ఉందట. ఈ పాత లెక్కలు, ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో 'పుష్ప' కొత్త లెక్కలు మాజీ లెక్కలు మాస్టారుకి మైత్రీ వారికి ఎలాంటి కొత్త చిక్కులు తెచ్చిపెడతాయో అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇకపోతే ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే 'పుష్ప' చిత్రంలో లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. ఇందులో హీరో హీరోయిన్ల పాత్రలు రాయలసీమ యాసలో మాట్లాడి అలరించనున్నాయి. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.