యాక్టర్ అజయ్ పేరు కంటే.. అతడి ఫేస్ మాత్రమే ప్రేక్షకుల్లో ఫేమస్! అంతెత్తున ఉండే అతడి కటౌట్.. విలనిజాన్ని పీక్ స్టేజ్ లో నిలబెడుతుంది. రౌద్రాన్ని తనదైన రీతిలో పిలికించే అజయ్.. విలన్ క్యారెక్టర్ కు మంచి ఆప్షన్ గా మారాడు. ఇటీవలే 20 సంవత్సరాల సినీ కెరీర్ ను పూర్తిచేసుకున్నాడీ నటుడు.
సినిమాల్లో మొరటు వ్యక్తిగా కనిపించే అజయ్.. నిజ జీవితంలో మాత్రం సాఫ్ట్ గా ఉంటాడు. ఫ్యామిలీ మ్యాన్ గా ఉండే అజయ్ ది లవ్ మ్యారేజ్. తనకెరీర్ పరంగా తన భార్య శ్వేత ప్రోత్సాహం ఎంతో ఉందంటాడీ రౌడీ. ఈ జంటకు ఇద్దరు మగ పిల్లలు. అవకాశం దొరికితే ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అయితే.. అజయ్ ఫ్యామిలీ గురించి ఆడియన్స్ కు పెద్దగా తెలియదు. ఇటీవలె వెకేషన్ కు వెళ్లి అజయ్ ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా.. తన సినిమాలపై పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారని అంటాడు అజయ్. ‘ఏంటి డాడీ ఎప్పుడూ దెబ్బలు తింటుంటావు?’ అని అడుగుతుంటారట ఆయన జూనియర్స్. ముఖ్యంగా చిన్నోడు ఈ విషయంపై ఎక్కువగా డిస్కస్ చేస్తుంటాడట. దీనికి.. ‘దెబ్బలు తింటేనే మనకు డబ్బులొస్తాయి’కదా డాడీ అని సరదాగా బదులిస్తుంటాడట అజయ్.
ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రంలో ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్న అజయ్.. అల్లు అర్జున్ ‘పుష్ప’లోనూ నటిస్తున్నట్టు సమాచారం. ఇంకా.. ‘ఆహా’ ఓటీటీ కోసం సుధీర్ వర్మ నిర్మిస్తున్న ఓ వెబ్‌సిరీస్‌తోపాటు చందు మొండేటి దర్శకత్వంలో మరో వెబ్‌సిరీస్ చేస్తున్నాడు అజయ్.