ప్ర‌గ‌తి ఫ్యామిలీ లైఫ్‌ పై సంచ‌ల‌న విష‌యాలు!

Update: 2022-10-27 02:49 GMT
క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అక్క‌..అమ్మ‌..చెల్లి పాత్ర‌ల‌తో టాలీవుడ్ లో బాగా ఫేమ‌స్ అయిన న‌టి. స్టార్ హీరోల చిత్రాల్లో త‌ప్ప‌ని స‌రిగా ప్ర‌గ‌తి ఉండాల్సిందే అన్నంత‌గా ముద్ర వేసారు. అయితే ఇటీవ‌లి కాలంలో న‌టిని మంచి మ‌రింత ఫేమ‌స్ అవుతోంది. జిమ్ వీడియోలు..యోగా సెష‌న్ల వీడియోలు సైతం షేర్ చేసి అభిమానుల‌కు డ‌బుల్ భోనంజా అందిస్తున్నారు.

న‌టిని మించి వ్య‌క్తిగ‌తంగా మంచి పాపులారిటీని తీసుకొచ్చిన వీడియోల‌వి. ఆ వీడియోల్లో హీరోయిన్ల‌కు తానేమి త‌క్కువ కాద‌ని నిరూపించ‌డమే అంత‌టి సంచ‌ల‌నానికి దారి తీసింది. అయితే ప్ర‌గ‌తి డ్రీమ్ ఇది కాదు. ఇండస్ర్టీని హీరోయిన్ గా  దున్నేయాల‌ని ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చారు. మోడ‌లింగ్ నుంచి న‌టిగా మేక‌ప్ వేసుకున్నారు.  

ఈ క్ర‌మంలోనే ఓ త‌మిళ న‌టుడు భాగ్య‌రాజ్ సర‌స‌న న‌టించే  ఛాన్స్ వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో త‌మిళ్ తో పాటు..మ‌ల‌యాళంలోనూ అవ‌కాశాలు రావ‌డంతో మొత్తంగా ఏడు సినిమాలుల్లో న‌టించింది. ఇలా వేగం పుంజుకుంటోన్న స‌మ‌యంలోనే ఓ హీరో అస‌భ్యం గా మాట్లాడ‌టంతో హీరోయిన్ గా మ‌ళ్లీ నటించ‌కూడ‌ద‌ని ఆ త‌ర‌హా పాత్ర‌ల వైపు మ‌ళ్లీ చూడ‌న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసారు.

అలాగే లాక్ డౌన్ స‌మ‌యంలో ఎంత‌గా ఇబ్బందుల‌కు గురైందో కూడా రివీల్ చేసారు.'కోవిడ్ స‌మ‌యంలో షూటింగ్ లేవు. దీంతో ఆర్ధిక ఇబ్బంద‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఇంట్లో బంగారం తీసుకెళ్లి అమ్మేసాను. ఆ స‌మ‌యంలో ఆ న‌గ‌లు ఎంత‌గానో ఉప‌యోగప‌డ్డాయి. లేదంటే తిండి కూడా తిన‌లేని ప‌రిస్థితి. నాలాంటి ఎంతో మంది ఇబ్బంది ప‌డ్డారు.

ఆ రోజులు గుర్తు చేసుకుంటేనే భ‌యాన‌కంగా అనిపిస్తుంది అన్నారు. అలాగే  ప్ర‌గ‌తి ఫ్యామిలీ లైఫ్ గురించి వివ‌ర‌ణ ఇచ్చారు. 'నా దాంప‌థ్య జీవితం సాఫీగా సాగాల‌ని ఎంత‌గానో ప్ర‌య‌త్నించాను. కానీ నా ప్ర‌య‌త్నాలేవి ఫ‌లించ‌లేదు. అందుకే విడాకులు తీస కున్నా. త‌ప్పులు ఎత్తి చూప‌డం కూడా ఇప్పుడు అన‌వ‌స‌రం . అదంతా ముగిసిపోయిన గ‌తం.

దాని గురించి మ‌ళ్లీ ఆలోచించాల‌నుకోవ‌డం  లేదు.  నా పిల్ల‌ల్ని ఒంట‌రిగా నేను చదివించాను. ఇప్పుడు వారు జీవితాల‌కు సంబంధించి సొంత నిర్ణ‌యాలు తీసుకునే స్థాయికి చేరుకున్నారు. ఆ ర‌క‌మైన బెంగ నాకు లేదు. పిల్ల‌లు సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నా' అని తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News