తనయుడు రామ్ చరణ్ గురించి మెగాస్టార్ చిరంజీవి చాలా సందర్భాల్లో బలం..బలహీనతలు..సినిమాలపై తన అభిరుచి ఎలా ఉంటుందన్నది చెప్పుకొచ్చారు. కానీ తండ్రి గురించి తనయుడు మాట్లాడింది చాలా తక్కువ. అది చాలా పరిమితంగానే మాట్లాడారు. అంతేగా తండ్రి ముందు తనయుడు అంత స్వేచ్ఛగా ఎలా మాట్లాడగలరు? కానీ తాజాగా చిరంజీవి గురించి ఎన్టీవీ వార్షిక పురస్కారాల వేడుకలో ఆసక్తికరంగా స్పందించారు.
`ప్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా` పురస్కారం అందుకున్న తర్వాత చరణ్ పాత విషయాలు నెమర వేసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా కంటే ముందు రాజమౌళి తనతో చేసిన మగధీర ముచ్చట్లు గుర్తు చేసుకున్నారు. `నాకు ఫోన్ చేసి మగధీర కథ విషయంలో చిరంజీవి గారికి కూడా చెప్పి అనుమతి తీసుకుందామన్నారు. ఇంట్లో ఓరోజు మగధీర కథ చిరంజీవి గారికి నేరెట్ చేస్తున్నారు.
కథ నచ్చడంతో ఆయన బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. ఆసమయంలో నేను పక్కనే ఉన్నాను. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి చిరంజీవి గారు బాగా ఉద్వేగానికి గురవుతున్నారు. అందులో హెలికాప్టర్ నుంచి కిందకి దూకే సీన్ గురించి చాలా సీరియస్ గా చర్చ సాగుతుంది. అప్పుడే చిరు ఆ సీన్ చాలా సీరియస్ గా ఉండాలని చిరు అన్నారు.
అప్పుడే రాజమౌళికి విషయం అర్ధమై ఈ కథ మీ కోసం కాదు..చరణ్ కోసం అనేసరికి డాడి ఒక్కసారిగా డీలా పడిపోయారు. అప్పటి నుంచి ఎగ్జైట్ మెంట్ తగ్గించుకుని కథ వినడం మొదలుపెట్టారు. ఏ కథ విన్నా ముందు ఆ కథలో చిరంజీవి ఇన్వాల్వ్ అయిపోతారు. ఈ వయసులో కూడా అదే ఉత్సాహం చూపిస్తారు. తాము ఆయనకు పోటీనో..ఆయనకు మేమంతా పోటీనో అరధం కావడం లేదంటూ చరణ్ నవ్వేసారు.
సినిమాల్లోకి వచ్చే ముందు కొన్ని విలువైన సలహాలు కూడా ఇచ్చారు. ఎప్పుడు నీ చట్టు ఉండే వాళ్లని బాగా చూసుకోమని చెప్పేవారు. దర్శకుల్ని..నిర్మాతల్నే కాకుండా మిగతా స్టాప్ని సమానంగా చూడాలి అన్నది చిరు అభిమతమని తెలిపారు. ఇటీవలే చిరంజీవి నాకు ఎవ్వరూ పోటీ కాదని...తనకు తానే పోటీ అని ఓ వేడుకలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.