టాలీవుడ్ రికార్డ్ బ్రేకింగ్ డెబ్యూ కోసం చ‌ర‌ణ్ వ‌స్తున్నాడు!

Update: 2021-02-15 13:30 GMT
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన డెబ్యూ చిత్రం ఉప్పెన సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ డెబ్యూ హీరోల రికార్డులన్నీ తుడిచేసి స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. కేవ‌లం మూడు రోజుల్లో సుమారు 30 కోట్లు వ‌సూలు చేసి 50కోట్ల క్ల‌బ్ వైపు దూసుకెళుతోంది. ఒక డెబ్యూ హీరోకి ఇంత వేవ్ రావ‌డం అన్న‌ది ఇదే తొలిసారి. క్రైసిస్ ని సైతం లెక్క చేయ‌క ఉప్పెన ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో మెగా ఫ్యామిలీలో ఆనందం స్కైని ట‌చ్ చేస్తోంది.

ఉప్పెన ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ డెబ్యూ మూవీ చిరుత రికార్డును కూడా తుడిచేసింది ఉప్పెన‌. అలాగే అఖిల్ .. బెల్లంకొండ శ్రీ‌నివాస్ వంటి డెబ్యూ హీరోల రికార్డుల‌న్నీ తెర‌మ‌రుగైపోయాయి. ఇక ఇదే ఉత్సాహంలో వైష్ణ‌వ్ తేజ్ వ‌రుస స‌క్సెస్ మీట్ల‌తో బిజీగా ఉన్నారు.

ఇక వైష్ణ‌వ్ కోసం ప్ర‌చారానికి  మ‌గ‌ధీర రామ్ చ‌ర‌ణ్ బ‌రిలో దిగుతున్నాడు. ఇంత‌కుముందు ఈనెల 17న రాజ‌మండ్రిలో జ‌ర‌గ‌నున్న ఉప్పెన గ్రాండ్‌ స‌క్సెస్ మీట్ కి చ‌రణ్ అతిథిగా హాజ‌ర‌వుతున్నారు. ఈ వేదిక‌కు భారీగా మెగాభిమానులు త‌ర‌లిరానున్నార‌ని తెలిసింది. మేన‌ల్లుడిపై చ‌ర‌ణ్ ప్ర‌శంస‌లు ఏ రేంజులో ఉండ‌నున్నాయో వేదిక వ‌ద్ద వీక్షించాల్సిందే. సుకుమార్.. మైత్రి మూవీ మేకర్స్ బృందాలు ఈ వేదిక‌పై త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేయ‌నున్నాయి. ఉప్పాడ ప‌రిస‌రాల్లో ఉప్పెన సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డి నుంచి భారీగా వైష్ణ‌వ్ అభిమానులు త‌ర‌లి రానున్నార‌ని తెలిసింది.
Tags:    

Similar News