గ్యాప్ లేకుండా బాల‌య్య తాండ‌వం!

ఆర్ ఎఫ్ సీలో కీల‌క యాక్ష‌న్ షెడ్యూల్ పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో బాల‌య్య పై కీల‌క మైన య‌క్ష‌న్ సీక్వెన్స్ తెర‌కెక్కించారు.

Update: 2024-12-29 14:30 GMT

న‌ట‌సింహ బాల‌కృష్ణ వెరీ బిజీ నౌ అన‌క త‌ప్ప‌దు. సినిమాలు..రాజకీయం..ఆహా షో అంటూ చాలా బిజీగా ఉన్నారు. ఇటీవ‌లే `డాకు మ‌హారాజ్` షూటింగ్ పూర్తిచేసారు. అటుపై వెంట‌నే బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ తాడ‌వం` ప‌ట్టాలెక్కించారు. తాజాగా ఆ సినిమా తొలి షెడ్యూల్ కూడా పూర్త‌యింది. ఆర్ ఎఫ్ సీలో కీల‌క యాక్ష‌న్ షెడ్యూల్ పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో బాల‌య్య పై కీల‌క మైన య‌క్ష‌న్ సీక్వెన్స్ తెర‌కెక్కించారు.

మ‌రి సింహం ఇప్పుడైనా గ్యాప్ తీసుకుంటుందా నా ఆక‌లి తీర‌న‌ది అంటూ రెండ‌వ షెడ్యూల్ కూడా పట్టా లెక్కించారు. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ కూడా మొదలైంద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్ లో బాల‌య్య‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా జాయిన్ అవుతుందిట‌. మ‌రి ఈ షెడ్యూల్ హైద‌రాబాద్ లో ఏ ప్రాంతంలో జ‌రుగుతుంది? అందులో పాల్గొంటున్న న‌టీన‌టులు ఎవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఆధ్యాత్మిక అంశాల‌తో ముడిపెడ్డి భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా పాన్ ఇండియాలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఇందులో బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈసారి ఆ పాత్ర‌ల‌తో బాల‌య్య ఇండియాని షేక్ చేయ‌డం ఖాయ‌మంటున్నారు. `అఖండ‌` సినిమాని మించి తాండ‌వం ఉండ‌బోతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో బాల‌య్య కు కొత్త ఇమేజ్ రావడం ఖాయ‌మంటున్నారు.

యాక్ష‌స్ సీన్స్ కోసం బాల‌య్య కూడా అలాగే శ్రమిస్తున్నారుట‌. 64 ఏళ్ల వ‌య‌సులోనూ బాల‌య్య యాక్షన్ స‌న్నివే శాల్లో ఏమాత్రం త‌గ్గ‌లేదట‌. `డాకు మ‌హారాజ్` లోనూ బాల‌య్య రియాల్ స్టింట్స్ చేసిన‌ట్లు ద‌ర్శ‌కుడు బాబి తెలిపాడు. అలాంటి బాల‌య్య `అఖండ తాడ‌వం` కోసం ఇంకే రేంజ్ లో చెల‌రేగుతారో చెప్పాల్సిన ప‌నిలేదు. `డాకు మ‌హారాజ్` రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో ఆ సినిమా ప్ర‌చారం ప‌నుల్లో పాల్గొంటారు. ఆ స‌మ‌యంలో `అఖండ తాడ‌వం` షూటింగ్ కి బ్రేక్ ఇస్తారు. అప్ప‌టి వ‌ర‌కూ నాన్ స్టాప్ బ్యాటింగ్ కంటున్యూ అవుతుంది.

Tags:    

Similar News