వాళ్లు పెట్టిన ఇబ్బందితో నిర్మాణం వదిలేస్తున్నా..!
బాలీవుడ్ స్టార్ కపుల్ బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్‌లపై ప్రముఖ సింగర్, ప్రొడ్యూసర్ అయిన మికా సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.
బాలీవుడ్ స్టార్ కపుల్ బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్‌లపై ప్రముఖ సింగర్, ప్రొడ్యూసర్ అయిన మికా సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. వారితో తాను చేసిన 'డేంజరస్' ప్రాజెక్ట్ పూర్తి చేయడంకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. వారితో పడ్డ ఇబ్బందులతో తాను ముందు ముందు ప్రొడక్షన్ చేయకూడదని అనుకున్నాను. తాను పూర్తిగా సినిమాలు లేదా సిరీస్‌ల నిర్మాణంను వదిలేయాలని అనుకున్నాను. ఎన్నో ఆశలతో మొదలు పెట్టిన ప్రాజెక్ట్ అత్యంత దారుణమైన అనుభవాన్ని నాకు మిగిల్చింది. వారు నాకు చుక్కలు చూపించారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మికా సింగ్ మాట్లాడుతూ... నేను నిర్మించిన ఒకే ఒక్క ప్రాజెక్ట్ 'డేంజరస్'. చాలా ఆలోచించిన తర్వాతే నేను ప్రొడక్షన్‌లో అడుగు పెట్టాను. విక్రమ్ భట్ అందించిన కథ కావడంతో నేను నమ్మకంతో ప్రొడక్షన్‌ను మొదలు పెట్టాను. కాస్టింగ్ విషయంలో చాలా రోజులు ఆలోచించి, ఎంతో మందితో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని తీసుకున్నాను. కథకు తగ్గట్లుగా సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతో కరణ్ సింగ్‌ను తీసుకున్నాం. ఆయన భారీగా పారితోషికం డిమాండ్ చేసినా ఓకే అన్నాం. ఆయనతో నటించేందుకు కొత్త నటిని ఎంపిక చేస్తే బడ్జెట్ పరిధి దాటుతుందని భావించి ఆయన భార్య బిపాసా బసును తీసుకున్నాం.
స్వయంగా ఆమె ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తాను అంది. ఆమె మాట కాదనలేక ఆమెను నటింపజేశాం. మూడు నెలల్లో పూర్తి చేయాలి అనుకున్న ఈ ప్రాజెక్ట్ వారిద్దరూ సరైన సమయంకు షూటింగ్‌కు హాజరు కాకపోవడంతో పాటు, డేట్లు సరిగ్గా ఇవ్వక పోడంతో ఆరు నెలల సమయం పట్టి బడ్జెట్ భారీగా పెరిగింది. షూటింగ్‌లో భాగంగా నెల రోజుల పాటు 50 మందితో కలిసి లండన్‌కి వెళ్లాం. అక్కడ హోటల్‌లో వేరు వేరు రూమ్స్ కావాలని వారిద్దరు అడగడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. సింగిల్ రూం తీసుకున్నా వారు వద్దు అన్నారు. వారు అలా ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు. బడ్జెట్ భారీగా పెరగడంతో పాటు ప్రతి విషయంలోనూ వారు నాతో అదనంగా ఖర్చు పెట్టించారు.
ఎన్నో కష్టాలు పడి వారితో ఇబ్బందులు పడి షూటింగ్ పూర్తి చేశాం. ఆ తర్వాత డబ్బింగ్ కి సైతం వారితో ఇబ్బంది తప్పలేదు. డబ్బింగ్ చెప్పడానికీ వారు చాలా కండీషన్స్ పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇలాగే ప్రవర్తిస్తారని తెలుసుకున్నాను. అందుకే ఒకే ఒక్క ప్రాజెక్ట్‌తోనే తన నిర్మాణ సంస్థను మూసి వేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ ఇద్దరి ప్రవర్తనను నేను ఎప్పటికీ మరచిపోలేను. నాకు ఒక్క ప్రాజెక్ట్‌తోనే చుక్కలు చూపించారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. మికా సింగ్ వ్యాఖ్యలపై బిపాసా బసు మరియు కరణ్ సింగ్‌ల స్పందన ఏంటి అనేది తెలియాలి. ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.