ఎన్టీఆర్ అభిమానులు చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’లో తారక్ చేస్తున్న కొమరం భీమ్ పాత్రకు సంబంధించి టీజర్ ఈ రోజే విడుదలైంది. ఇంతకుముందు సీతారామరాజు టీజర్‌కు తారక్ వాయిస్ ఇస్తే.. ఇప్పుడు భీమ్ టీజర్‌ను చరణ్ నరేట్ చేశాడు. రామరాజు టీజర్‌లో విజువల్స్ ఎంత హైలైట్ అయ్యాయో తారక్ వాయిస్ అంతగా హైలైట్ అయింది. అప్పట్లో అదో హాట్ టాపిక్ అయింది. తారక్ డిక్షన్ గురించి అందరూ ఎంతగానో మాట్లాడుకున్నారు. తెలుగులో మాత్రమే కాదు.. హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఎన్టీఆర్ ఈ టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రతి భాషలోనూ నేటివిటీ ఫీల్ పోకుండా, ఎంతో కచ్చితత్వంతో డైలాగులు పలికి వావ్ అనిపించాడు తారక్. ఈ విషయంలో తారక్‌ను మ్యాచ్ చేయడం చరణ్‌కు సవాలుగా నిలిచింది.
ఐతే తారక్‌తో పోలిస్తే చరణ్ వాయిస్ ఓవర్ కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నట్లే అనిపిస్తోంది చూసిన వాళ్లకు. చరణ్‌కు కూడా మంచి బేస్ వాయిస్ ఉన్నప్పటికీ.. టీజర్లో వాయిస్ ఓవర్ ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐతే తారక్ లాగే చరణ్ సైతం తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. కానీ ఎందులోనూ ఎబ్బెట్టుగా అనిపించలేదు. హిందీలో చరణ్ వాయిస్ కొంచెం భిన్నంగా ఉంది. అది అతడి వాయిసేనా అని కొంచెం సందేహం కలుగుతుంది కానీ.. జాగ్రత్తగా పరిశీలిస్తే చరణే హిందీ డైలాగులూ పలికినట్లు అర్థమవుతుంది. తమిళం, కన్నడలోనూ చరణ్ వాయిస్ ఓవర్ బాగా కుదిరింది. ఐతే తారక్ లాగే చరణ్ సైతం మలయాళ డబ్బింగ్‌కు దూరంగా ఉన్నాడు. దక్షిణాది భాషల్లో మలయాళం యాస భిన్నంగా ఉంటుంది. దాన్ని పట్టుకోవడం అంత సులువు కాదు. అందుకే తారక్, చరణ్ ఇద్దరూ రిస్క్ తీసుకోలేనట్లుంది.