దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శాండిల్ వుడ్ డ్రగ్స్ రాకెట్ లో నటీమణులు సంజన గల్రానీ - రాగిణి ద్వివేది లను బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వినియోగం - సరఫరా కేసులో సెప్టెంబర్ 7న రాగిణి ద్వివేదిని.. సెప్టెంబర్ 9న సంజనను అరెస్ట్ చేశారు. ఇద్దరూ 3 నెలలకు పైగా జైల్లో ఉండి ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చారు. అయితే ఇప్పుడు రాగిణి ద్వివేది - సంజనా గల్రాని తో పాటు మరో 25 మందిపై చార్జిషీట్ ఫైల్ చేశారు.
సెంట్రల్ క్రైం బ్రాంచ్(సీసీబీ) మరియు కాటన్ పేట్ పోలీసులు మంగళవారం ఎన్‌డీపీఎస్ కోర్టులో డ్రగ్స్ ముఠాలు - దందాలకు సంబంధించి సుమారు 2,900 పేజీల చార్జిషీట్ సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ ఛార్జిషీట్ లో 180 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు పరారీలో ఉన్న వారిపేర్లను కూడా ప్రస్తావించారు. అలానే 2019 మే 26న రాగిణి ద్వివేది బర్త్ డే పార్టీలో డ్రగ్స్ సరఫరా చేయడం.. ప్రియుడు రవిశంకర్ తో కలసి రాగిణి ఓ హోటల్ లో నిర్వహించిన పార్టీలో ఎక్స్‌టసీ డ్రగ్ మాత్రలు తీసుకోవడం.. ఇతరులకూ సరఫరా చేయడం వంటి వాటిని ఈ చార్జిషీట్ లో ప్రస్తావించారు.
ఇంకా 2020 జూలై 5న యలహంక లెరోమా హోటల్ లో డ్రగ్స్ సేవించారని.. 2020 జనవరి నుంచి ఆగస్టు వరకు ముఖ్య నిందితుడు లూమ్ పెపే సాంబా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అలానే నైజీరియాకు చెందిన వ్యక్తి నుంచి రాగిణి డ్రగ్స్ తీసుకుందని.. ఆమె వాట్సాప్ చాటింగ్ ద్వారా కీలక సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఇందులో రాగిణికి వ్యతిరేకంగా రవిశంకర్ భార్య చేసిన చాటింగ్ ను కూడా పొందుపరిచారని తెలుస్తోంది.