ఈరోజు పొద్దున్నే నాకు పెళ్ళిజరగబోతోంది అంటూ ఓ ఫోటో పెట్టి ఛార్మి కాస్త చలాకీతనం చూపించే ప్రయత్నం చేసింది. కాకపోతే అది జ్యోతిలక్ష్మి సినిమా షూటింగ్ నుండి తీసుకొచ్చిన స్టిల్ అని ఎవ్వరికి అర్ధమవ్వట్లేదు చెప్పండి? కాని ఛార్మి మాత్రం.. పిల్లి పాలు త్రాగినప్పుడు కళ్ళు మూసుకొని ఊరంతా చికటిగా ఉందే అనుకున్నట్లు.. సాయంత్రానికి సూపర్కామెడీ స్టార్ట్ చేసింది...
''నా పెళ్ళయ్యిపోయింది. చెప్పలేదు కదూ, ఇది జ్యోతిలక్ష్మి సినిమాలోని సీన్'' అంటూ మళ్ళీ తన ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. చూస్తుంటే ఇదంతా ఛార్మి తాను అతి పెద్ద కామెడీ చేశానని, రోజంతా ఆడియన్స్‌ను ఫూల్స్ చేశానని అనుకున్నట్లుంది. నిజానికి ఈ జోక్‌కు అస్సలు నవ్వే రాలేదు ఛార్మి. ఎందుకంటే ఇది అసలు జోకే రాలేదు. పైగా ట్విట్టర్లో ఓపెన్‌గా పెళ్ళి అని పెడితే, అది ఖచ్తితంగా ఏదో పాపులార్టీ కోసం చేసే ప్రయత్నమే కాని, అందులో ఏ మాత్రం నిజం ఉండదని జనాలు అందరూ బాగా నమ్మేస్తున్న ఈ కాలంలో.. ఇలా పెళ్ళి జోక్ ఎందుకమ్మా ఛార్మి? ఈసారి ఏదైనా కొత్త కాన్సెప్టు ట్రై చేయి..