ఛార్మి.. సైకిల్ తో దొంగిలించింది

Update: 2015-09-19 13:30 GMT
అందాల ఛార్మి ఏంటి సైకిల్ దొంగ‌త‌నం చేయ‌డ‌మేంటి? అని సందిగ్ధంలో ఉన్నారా? మ‌రీ అంత కంగారు ప‌డొద్దు. ఛార్మి ఏ సైకిల్‌ ని దొంగిలించ‌లేదు. సైకిల్ తొక్కుతూ మ‌న‌సు దొంగ అయ్యింది అంతే. కుర్రాళ్ల గుండెల్ని దొంగిలించే గ‌జ‌గామిని అయ్యింది. క్ష‌ణ‌క్ష‌ణం మ‌న‌సు పిండేసే పెడ‌లింగ్ రాణీ అయ్యింది. అప్ప‌ట్లో క‌న్న‌డ న‌టి సంజన బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్‌ కి సైకిల్ తొక్కుకొచ్చింది. అలాంటి ఫీట్ ఏదైనా ఛార్మి వేస్తోందా?  అనే సందేహం మీకు రావొచ్చు. అదీ కూడా కాదు.

ఛార్మి ఇలా సైక్లింగ్ చేయ‌డం వెనుక ర‌హ‌స్యం వేరే ఉంది. మ‌గువ అందాల్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి. స్లిమ్ ఫిట్‌ గా క‌నిపించాలంటే ఏం చేయాలి?  ఛార్మి ప్ర‌స్తుతం చేస్తున్న‌ది అదే. ఇలా సైక్లింగ్ చేయ‌డం వల్ల పిక్క‌ల నుంచి న‌డుము వొంపుల వ‌ర‌కూ న‌ర‌న‌రాన వేడి పాకిరిపోతుంది. అలా పాకిరిన వేడి కొలెస్ట‌రాల్‌ ని కంట్రోల్ చేస్తుంది. అవ‌స‌రం లేని కొవ్వును క‌రిగించ‌డం ద్వారా స‌న్న‌జాజి న‌డుము మీ సొంతం అవుతుంది. త‌ద్వారా స్లిమ్ ఫిట్ మెయింటెయిన్ చేయొచ్చు..
 
అయితే ఛార్మిలాంటి సెల‌బ్రిటీ ఇలా వీధుల్లో ప‌డి సైక్లింగ్ చేయాలంటే చాలా క‌ష్టం. అందుకే ఆ మూతికి గుడ్డ క‌ట్టుకుంది. ముఖాన్ని బైట ఎవ‌రికీ క‌నిపించ‌కుండా చేయ‌డానికే ఇలా చేస్తోంది. అప్పు, డౌను అనే తేడాలేకుండా సైకిల్  తొక్కాలి. ఎత్తు ప‌ల్లాల్ని సైకిల్‌ తో ఎక్కించిన‌ప్పుడే అస‌లైన రాపిడి వ‌ర్క‌వుట‌వుతోంద‌ని ప్రాక్టిక‌ల్‌ గా చెబుతోంది. ఇప్పుడ‌ర్థ‌మైందా?  ఛార్మింగ్ బ్యూటీ సైక్లింగ్ వెన‌క‌, మ‌న‌సు దొంగ‌తనం వెన‌క అస‌లు నిజం.
Tags:    

Similar News