స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టైమ్ అస్సలు బాగోలేదు ఇప్పుడు. ఏ సినిమా తీసినా ఫ్లాప్ అవుతోంది. వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీలో హీరోలు పూరీని నమ్మడం దాదాపుగా మానేశారు. ఇలాంటి టైమ్‌లో పూరీతో సినిమా చేసేందుకు రామ్ ముందుకొచ్చాడు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా అసలు సెట్స్‌పైకి వెళ్తుందా అనే సందేహాలు వస్తున్నాయట చాలామందికి. దానికి కారణం.. చార్మింగ్ బ్యూటీ చార్మీ.
సాధారణంగా తన సినిమాకు సంబంధించి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ మొత్తం పూరీయే చూసుకుంటాడు. ఇందులో వేరేవాళ్ల ఇన్‌వాల్వ్‌మెంట్ అస్సలు ఉండదు. కానీ ఎప్పుడైతే చార్మీ.. పూరీ కనెక్ట్ లోకి కనెక్ట్ అయ్యిందో అప్పటినుంచి పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడు రామ్ సినిమాకు సంబంధించి కథ - కథనాల్లో చార్మీ యాక్షన్ - ఓవరాక్షన్ చాలా ఎక్కువుగా ఉందట. ఇక హీరో రామ్ గురించి కొత్తగా చెప్పేదేముంది. డైరెక్టర్ ఎవ్వరైనా కాస్టూమ్స్, డ్యాన్సులు విషయంలో తాను చెప్పిందే జరగాలంటాడు. లేకపోతే అలుగుతాడు అనే విమర్శలున్నాయి. దీంతో.. ఇప్పుడు రామ్, చార్మీ మధ్య గొడవలు అయితే జరగడం లేదు కానీ.. ఇంచుమించు అలాంటి వాతావరణమే ఉందని ఇండస్ట్రీ టాక్. వీరిద్దరి మధ్య ఇప్పుడు పూరీ నిజంగా పూరీలాగే నలిగిపోతున్నాడట.
Full View