తొక్క తొక్కితే ఓ స్టోరీ.. తొక్క తొక్కకపోతే ఒక స్టోరీ.. నానా బీభత్సం చేసి వదిలిపెట్టాడు పూరి జగన్. అప్పట్లో దేవుడ్కీ చేసిన్కీ మనుషుల్ అంటూ ''దేవుడు చేసిన మనుషులు'' సినిమాను తీసిన పూరి, ఆ సినిమాలో తన కథల తాలూకు పరాకాష్ట చూపించేశాడు. రికార్డు బ్రేకింగ్ టైములో సినిమాను తీశాడు కాని, కంటెంట్ మీద మాత్రం ఫోకస్ చేయలేదు. కాకపోతే టేకింగ్ పరంగా కుమ్మేశాడు. ఇక ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు టచ్ చేస్తున్నాం అంటే...
అబ్బే ఏం లేదండీ.. ప్రస్తుతం పూరి ఛార్మితో కలసి ''జ్యోతిలక్ష్మి'' సినిమాను తీస్తున్నాడు. మొన్న మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా ఆడాళ్లం మేము వంటింటి కుందేళ్ళం కాదు అంటూ ఛార్మి ఒక వీడియో టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఆ రోజు మొదలైన షూటింగ్, అప్పుడే అయిపోయింది కూడా. ఇవాళే గోవాలో షెడ్యూల్ ముగించుకున్న యునిట్, ఇంకో వారంలో హైదరబాద్‌లో బ్యాలెన్స్ వర్క్‌ను షూట్ చేసి ఖేల్ కతమ్ దుఖాన్ బంద్ అనేస్తారట. చూస్తుంటే మనోడు ఏదైనా సాలిడ్ స్టోరీని తీశాడా లేకపోతే తొక్క వేస్తే గోవా బీచ్‌లో వెయ్యకపోతే గోవా ఫోర్ట్‌లో అన్నట్లు ఏదైనా అల్లేశాడే అనే సందేహాలు వచ్చేస్తున్నాయి. వెయిట్ అండ్ సి.