గీతా ఆర్ట్స్ కు పెద్ద దెబ్బ అనుకోవాలా..?

Update: 2021-03-27 17:30 GMT
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ పై బన్నీ వాస్ నిర్మించిన 'చావు కబురు చల్లగా' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందన వచ్చింది. చిన్న వయసులోనే భర్త చనిపోయిన అమ్మాయిని ఓ యువకుడు ప్రేమలో పడేయడం అనే వినూత్న‌మైన కథతో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదని తెలుస్తోంది. ఫస్ట్ వీక్ థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి 'చావు కబురు చల్లగా' ప్లాప్ గా మిగిలిపోయింది.

ఈ సినిమాలో హీరోహీరోయిన్లు కార్తికేయ - లావణ్య త్రిపాఠి బాగా నటించారనే పేరు తెచ్చుకున్నారు. నిజానికి బస్తీ బాలరాజు పాత్ర కోసం యువ హీరో చాలా కష్టపడ్డాడు. దీనికి తగ్గట్టే సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ కూడా బాగా చేసాడు. గీతా ఆర్ట్స్ వారి భారీ పబ్లిసిటీ కారణంగా ఫస్ట్ డే ఓ మోస్తరు కలెక్షన్స్ వచ్చినప్పటికీ.. రెండో రోజు నుంచి ఈ సినిమా ప్రభావం చూపలేకపోయింది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' చిత్రానికి అన్ని క‌లుపుకొని దాదాపుగా 13.5 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యే నాటికి ఈ సినిమా 5 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయిందని ట్రేడ్ టాక్. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ కు ఇది పెద్ద దెబ్బ అనే అనుకోవాలి. ఆర్థికంగా నష్టపోనప్పటికీ.. ట్రేడ్ లో హిట్ ఫ్యాక్టరీగా పేరున్న గీతా ఆర్ట్స్2 క్రెడిబిలిటీని కాస్త తగ్గించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






Tags:    

Similar News