తమిళ నటుడు ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తన నుంచి రూ.70 లక్షలు తీసుకున్నాడని ఆరోపిస్తూ శ్రీలంకకు చెందిన ఓ యువతి కేసు పెట్టినట్టు సమాచారం. లాక్ డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్నానంటూ తన నుంచి డబ్బులు తీసుకున్నాడని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ కార్యాలయాలకు లేఖలు కూడా రాశారట సదరు యువతి.
తనను పెళ్లి చేసుకోకపోగా.. మోసం చేశారని ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఆరర్యకు డబ్బులు పంపిన వివరాలు, తనతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెబుతోందట. ఈ క్రమంలో ఆర్య ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. ఆర్య తరపున అర్మన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
అయితే.. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి.. ఆర్యకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసినట్టు తెలిసింది. కాగా.. ఆర్య 2019లోనే వివాహం చేసుకున్నారు.