బ్రేకప్‌ పుకార్లకు చెక్‌ పడ్డట్లేనా?

Update: 2020-06-29 02:47 GMT
బాలీవుడ్‌ ప్రేమ జంట అర్జున్‌ కపూర్‌ మలైకా అరోరాల విషయమై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మలైకా కంటే అర్జున్‌ పదేళ్లకు పైగా చిన్నవాడు అయినా కూడా ఆమెతో డేటింగ్‌ చేస్తున్నాడు. ఆమె కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకుంది. అది అర్జున్‌ వల్లే అనేది చాలా మంది అనుమానం. ఆ అనుమానం నిజం అనిపించేలా ఎప్పుడైతే విడాకులు అధికారికంగా మంజూరు అయ్యాయో అప్పటి నుండి అర్జున్‌ కపూర్‌ మలైకాలు బాహాటంగా బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గడచిన మూడు సంవత్సరాల కాలంలో వీరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌ లో ఎప్పుడూ కూడా హాట్‌ టాపిక్‌గానే ఉంది.

వీరిద్దరి పెళ్లి గురించి రెగ్యులర్‌గా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. వీరిద్దరు అసలు పెళ్లి చేసుకుంటారా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో అనూహ్యంగా కొన్ని కారణాల వల్ల వీరి ప్రేమ బ్రేకప్‌ అయ్యింది అంటూ ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ మీడియాలో సైతం గత కొన్ని నెలలుగా వీరిద్దరు కలుసుకోలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. బ్రేకప్‌ వార్తలను పటాపంచలు చేసేలా మలైకా అరోరా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది.

తాజాగా అర్జున్‌ కపూర్‌ బర్త్‌డే సందర్బంగా మలైకా స్పెషల్‌ విశెష్‌ చెప్పింది. అతడితో కలిసి ఉన్న ఒక మంచి రొమాంటిక్‌ ఫొటోను షేర్‌ చేసి హ్యాపీ బర్త్‌ డే సన్‌ షైన్‌ అంటూ పోస్ట్‌ చేసింది. దీంతో ఇద్దరి మద్య ఇంకా మంచి సంబంధమే కొనసాగుతుందనే క్లారిటీ వచ్చేసింది. ప్రేమ బ్రేకప్‌ కాలేదు అంటూ హింట్‌ ఇచ్చిన మలైకా పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

Tags:    

Similar News