RRR కి ఆస్కారమే లేకుండా చేసి థియేట‌ర్ల‌కు..

Update: 2022-09-21 04:59 GMT
ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌.ఎఫ్‌.ఐ) పాన్ నీలన్ 'చెల్లో షో'(లాస్ట్ ఫిల్మ్ షో)ని ఆస్కార్ కు దేశ అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ గుజరాతీ చిత్రం గత 2 సంవత్సరాలుగా అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అనేక అవార్డులను కైవసం చేసుకుంది. అయితే హెడ్ లైన్స్ లో పాపుల‌రైన ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూడటానికి చాలా ఆసక్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

ఈ చిత్రం గుజరాత్ లో దేశవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన స్క్రీన్ లలో 2022 అక్టోబర్ 14న విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు భారతదేశంలో ఇప్పటి వరకు విడుదల కాని సినిమాను ఎంపిక చేయడంపై చాలా మంది నెటిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో RRR ఆస్కార్ బ‌రిలోకి అధికారిక ప్రవేశిస్తుంద‌ని తెలుగువారు ఆశించారు. కానీ అది జరగలేదు.

95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి భారతదేశం సమర్పించిన ఛెలో షో (చివరి సినిమా షో) ఎంపిక‌యింద‌న్న వార్త కొన్ని గంట‌ల క్రిత‌మే సంచ‌ల‌నంగా మారింది. ఆర్.ఆర్.ఆర్ లాంటి గొప్ప జ‌నాద‌ర‌ణ పొందిన చిత్రాన్ని ఆస్కార్  ఇండియా జూరీ ఎంపిక చేయ‌క‌పోవ‌డం షాకిచ్చింది.

2023 ఆస్కార్ కి భారతదేశం నుంచి అధికారికంగా 'ఛెల్లో షో' బ‌రిలో దిగుతోంది. దీని గురించి మాట్లాడుతూ దర్శకుడు పాన్ నలిన్ ఒక ప్రకటనలో ఆనందం వ్య‌క్తం చేసారు. ''ఇలాంటి రోజు వచ్చి వెలుగులు వేడుకలను తెస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేను.

ఛెలో షో ప్రపంచం నలుమూలల నుండి ప్రేమను అందుకుంటోంది. కానీ నా హృదయంలో ఒక బాధ ఉంది. నేను భారతదేశంలో ఆస్కార్ ఉనికిని ఎలా కనుగొనగలను? ఇప్పుడు నేను మళ్లీ ఊపిరి పీల్చుకుని.. వినోదాన్ని పంచే.. స్ఫూర్తినిచ్చే .. జ్ఞానోదయం చేసే సినిమాని నమ్మగలను!'' అని అన్నారు. FFI కి జ్యూరీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అక్టోబరు 14న థియేటర్లలోకి రాబోతున్న గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో' 35 ఎంఎం థియేట‌ర్ల‌లో వీక్షించ‌వ‌చ్చు. ఈ చిత్రంలో భవిన్ రాబరి- భవేష్ శ్రీమాలి- రిచా మీనా- దిపెన్ రావల్- పరేష్ మెహతా నటించారు. ఇది 2021లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిత‌మైంది. అక్టోబర్ 2021లో 66వ వల్లాడోలిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'ఛెల్లో షో' గోల్డెన్ స్పైక్ పుర‌స్కారాన్ని గెలుచుకుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News