ఊర మాస్ సినిమాలతో బాలయ్యను చూసి చూసి అలా అలవాటు పడిపోయాం కానీ ఆయనలో కూడా మంచి ప్రేమికుడు - లవర్ బాయ్ ఉన్నాడు. అప్పట్లో వచ్చిన ఆదిత్య 369 - బొబ్బిలి సింహ - సీతారామ కళ్యాణం - జననీ జన్మభూమి లాంటి సినిమాలు చూస్తే అందులో మంచి ప్రేమికుడిగా కనిపిస్తాడు బాలకృష్ణ. సింహా - లెజెండ్ లాంటి మూవీస్ తర్వాత ఆయనలో ఆ సున్నితత్వం కనిపించకుండా పోయింది. జైసింహ కొత్త ప్రోమోలు చూస్తుంటే మళ్ళి ఆ పాత యాంగిల్ ని బయటికి తీసినట్టు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోస్ లో నీతో నేనుంటా అనే పాటలో బాలయ్య - నయనతార మధ్య అందమైన కెమిస్ట్రీ తో పాటను షూట్ చేసిన కెఎస్ రవికుమార్ ఇద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ కూడా సెట్ చేసినట్టు కనిపిస్తుంది.
అందులో భాగంగా చూపించిన ఒక సీన్ లో నయనతార ‘నన్ను మరిచిపో ’ అంటే బాలయ్య రొమాంటిక్ గా అయ్యయ్యో అది కుదరదు సచ్చేదాకా మరిచిపోవడం కుదరదు ’ అని చెప్పడం బాగా పేలింది. నయనతార ఒప్పుకోకపోతే ఈ కథతో సినిమా చేసేవాళ్ళం కాదన్న నిర్మాత కళ్యాణ్ మాట నిజమే అనిపిస్తోంది ఈ ప్రోమోలు చూస్తుంటే. కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే నయనతార - ప్రకాష్ పాత్రలు సినిమాకు కీలకమనే టాక్ ముందు నుంచి ఉంది. మాస్ అవతారంలో ఒక వైపు - పోలీస్ కమీషనర్ గా మరో వైపు - లవర్ గా ఇంకో వైపు ఇలా రకరకాలుగా బాలయ్యను డిఫరెంట్ షేడ్స్ లో బాలయ్య జైసింహలో కొత్తగా కనిపిస్తున్నాడు. మరి సింహ పేరు సెంటిమెంట్ ప్లస్ సంక్రాంతి సెంటిమెంట్ రెండు వర్క్ అవుట్ అవుతాయి అని బలంగా నమ్ముతున్న ఫాన్స్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Full View