ఓటీటీలు రాజ్యమేలుతున్న ఈ క్రైసిస్ కాలంలో `ఫ్యామిలీ మ్యాన్` రెండు సీజన్లు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2 పెద్ద హిట్ కొట్టింది. అమెజాన్ ప్రైమ్ లో రికార్డ్ వ్యూస్ పొందుతోంది. జాతీయ అవార్డ్ గ్రహీత మనోజ్ బాజ్‌పాయ్ .. సమంత అక్కినేని షో స్టాపర్స్ గా నిలిచారు. ముఖ్యంగా ఈలం తమిళ టైగర్ పాత్రలో సమంత నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి.
ఇప్పుడు సీజన్ 2 ప్రసారం అయినప్పటి నుండి మూడవ సీజన్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలన్న తహతహ అందరిలోనూ పెరిగింది. నిజానికి ఫ్యామిలీమ్యాన్ సీజన్ 1 వచ్చాక ఏకంగా ఏడాదిన్నర కాలం వేచి చూడాల్సి రావడం అభిమానులకు చాలా ఇబ్బందిగా అనిపించింది. పార్ట్ -1 కూడా అంతటి ప్రభావం చూపించింది. దర్శకనిర్మాతలు రాజ్ అండ్ డీకే పనితనం ఏ రేంజులో ఉంటుందో ఇప్పుడు సీజన్ 2 మరోమారు నిరూపించింది. అందుకే ఇప్పుడు పార్ట్ 3 గురించి కూడా అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు.
తాజా సమాచారం మేరకు.. స్క్రిప్టింగ్ జరుగుతోంది. 2022 చివరిలో మాత్రమే కొత్త సీజన్ పనులు కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలిసింది. అమెజాన్ వాళ్లు స్క్రిప్ట్ ను ఫైనల్ చేసేస్తే 2022 చివరి నాటికి చిత్రీకరణ పనులు ప్రారంభమవుతాయి. ఈసారి సీజన్ లో శత్రుదేశం చైనా దుష్టచర్యలు కుట్ర కోణం కూడా చూపించే వీలుందని చెబుతున్నారు. బహుశా .. అమెరికా-భారత్ స్నేహసంబంధాలు మార్కెటింగ్ వ్యూహాలు దాయాది పాక్ తో శత్రుత్వం దరిమిలా ముసల్మాన్ దేశంతో చైనా చెలిమి వగైరా విషయాల్ని టచ్ చేస్తూనే ప్రపంచ రాజకీయాలతో ముడిపడిన కరోనా కుట్ర కోణాన్ని కూడా చూపించే వీలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.