ఈమధ్య ప్యాన్ ఇండియాల హంగామా కొనసాగుతోంది. ఆ కోవలోనే పలు భారతీయ భాషలలో దేశవ్యాప్తంగా విడుదలైన చిత్రం 'పహిల్వాన్'. సుదీప్ హీరోగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు కన్నడలో మంచి స్పందనే దక్కింది కానీ తెలుగులో మాత్రం రొటీన్ సినిమా అంటూ ప్రేక్షకులు పట్టించుకోలేదు.
తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషల్లో ఎక్కడా ఈ సినిమాకు ఆదరణ దక్కలేదు. అయితే అనూహ్యంగా ఈ సినిమా పట్ల చైనా అధికారులు ఆసక్తి చూపిస్తున్నారట. చైనా లో సినిమాలు రిలీజ్ చేయడం భారతదేశంలో కంటే భిన్నం. అక్కడ ప్రభుత్వ అధికారుల అనుమతి లేనిదే ఎలాంటి సినిమా అయినా విడుదలకు నోచుకోదు. అయితే ఈమధ్య చైనా అధికారులు సుదీప్ 'పహిల్వాన్' పట్ల ఆసక్తిగా ఉన్నారట. దీనికి కారణం ఏంటంటే ఈ సినిమా క్రీడల నేపథ్యంలో తెరకెక్కడం. చైనాలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ సినిమా అదే నేపథ్యంలో తెరక్కించినది కావడంతో తమ దేశ ప్రజలకు ప్రేరణనిచ్చేదిగా ఉంటుందని వారు భావిస్తున్నారట.
'పహిల్వాన్' మేకర్స్ కనుక చొరవచూపితే ఈ సినిమా చైనా లో రిలీజ్ కానున్న తొలి కన్నడ చిత్రం అవుతుందని సమాచారం. నిజానికి 'కెజీఎఫ్' నిర్మాతలు తమ చిత్రాన్ని చైనా లో విడుదల చేయాలని ప్రయత్నించారు కానీ ఎందుకో కుదరలేదట. 'కేజీఫ్' మిస్ అయింది కానీ ఈ 'పహిల్వాన్' చైనాలొ ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉంది.