ఆమె నోటి నుంచి వచ్చే మాటను అలానే వింటూఉండిపోవాలనిపిస్తుంది. వేల మంది గొంతుల్లోనూ ఆమె గొంతు సమ్ థింగ్ స్పెషల్. తెర మీద హీరోయిన్ మాట్లాడుతున్నా.. తెర వెనుక మాట్లాడిన చిన్మయి చప్పున గుర్తుకు కావటమే కాదు.. సినిమా అయ్యాక కూడా ఆమె గొంతు వెంటాడుతుంది.
సమంతకు ఈ రోజు ఇంత క్రేజ్ అంటే.. ఆమెకు గొంతు అరువు ఇచ్చిన చిన్మయి కూడా కారణంగా చెప్పక తప్పదు. తన మొదటి సినిమాలో చిన్మయి వాయిస్ కాకుండా మరే వాయిస్ అయినా.. సమంతకు అంత క్రేజ్ వచ్చేది కాదేమో? ఇలా తన గొంతుతోప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తాజాగా మరో సంచలానికి తెర తీశారు.
మీటూ అంటూ మహిళలపై జరిగే లైంగిక దోపిడీకి.. లైంగిక వేధింపుల పైనా గళం విప్పే విషయంలో.. జరిగిన వాస్తవాన్ని చెప్పేందుకు ఏ మాత్రం బయటపడని ఆమె.. తాజాగా తన జీవితంలో ఎదురైన మూడు అభ్యంతర ఘటనల గురించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమాల్లో ఆమె స్వరం మాదిరే.. ఆమె జీవితంలోని ఆ మూడు పాడు అనుభవాలు మనసును కలవరపెట్టటమే కాదు.. మన ఇంట్లోని ఆడపిల్లలకు అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని గుర్తు చేయటం ఖాయం.
తనకున్న స్టార్ సెలబ్రిటీ స్టేటస్ కు ఎక్కడ దెబ్బ తగులుతుందోనన్న భయానికి పోకుండా.. తనకు ఎదురైన దారుణ అనుభవాల గురించి ధైర్యంగా చెప్పిన చిన్మయకు హేట్సాప్ చెప్పకుండా ఉండలేం. ఆమె చెప్పిన మూడు దారుణ ఉదంతాల గురించి ఆమె మాటల్లోనే చెబితే..
1. ‘‘అప్పుడు నాకు ఎనిమిదేళ్లో... తొమ్మిదేళ్లో.. ‘సాంథోమ్ కమ్యూనికేషన్స్’ స్టూడియోలో మా అమ్మ తన డాక్యుమెంటరీ రికార్డింగ్‌లో ఉంది. నేను అక్కడే నిద్రపోతున్నాను. నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నట్టు అనిపించి దిగ్గున లేచేసరికి.. నా పక్కనే ఓ పెద్ద మనిషి!
2. "టీన్స్ లో ఉన్నప్పుడు చెన్నైలోని కిల్‌పాక్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్ తో నా బైక్ యాక్సిడెంట్ అయి పడిపోయాను. నా కుడిచేయి కొట్టుకుపోయి.. కదల్లేని స్థితిలో నేనుంటే కొంతమంది మగవాళ్లు పడిపోయిన నా దగ్గరకు వచ్చి నా షర్ట్ జేబుల్లో ఏముందో చూసే వంకతో నా చెస్ట్ టచ్ చేసే ప్రయత్నం చేశారు"
3. "నాకు పందొమ్మిదేళ్లప్పుడు.. మళ్లీ ఇంకో సంఘటన. ఈసారీ ఓ పెద్ద మనిషే. తన ఆఫీస్‌కు పిలిచాడు. నేను, అమ్మ ఇద్దరం వెళ్లాం. కాని నన్నొక్కదాన్నే లోపలికి రమ్మన్నాడు. బాగా పరియం ఉన్న వ్యక్తే కావటంతో వేరే అనుమానాలు లేకుండా.. అసలు రాకుండా.. ఆయన క్యాబిన్‌లోకి వెళ్లాను. ఆయన టేబుల్ వెనక నుంచి వచ్చి.. నన్ను హగ్ చేసుకున్నాడు.. అసభ్యంగా ప్రవర్తించబోయాడు"