సభ్యత్వంకు ఓకే.. కండీషన్స్‌ అప్లై

Update: 2018-12-30 06:04 GMT
మీటూ అంటూ తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయిని డబ్బింగ్‌ అసోషియేషన్‌ నుండి తొలగించిన విషయం తెల్సిందే. అసోషియేషన్‌ కు ఆమె చెల్లించాల్సిన మొత్తం చెల్లించని కారణంగానే ఆమెను బహిష్కరించినట్లుగా చెబుతూ వస్తున్నారు. ఆమె సభ్యత్వం రెన్యువల్‌ చేసుకోని కారణంగా ఆమెను తొలగించినట్లుగా చెప్పిన అసోషియేషన్‌ ఇప్పుడు ఆమె మళ్లీ డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ లో జాయిన్‌ అయ్యేందుకు ఓకే చెప్పారు. కాని అందుకు కండీషన్స్‌ పెట్టడం చర్చనీయాంశం అయ్యింది.

చిన్మయిని డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ లో రీ జాయిన్‌ చేసుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆమె అసోషియేషన్‌ కు 1.5 లక్షల రూపాయలు కట్టాలని, దాంతో పాటు అసోషియేషన్‌ కు మరియు అసోషియేషన్‌ అధ్యక్షుడు రాధా రవికి క్షమాపణలు చెప్పాలని కండీషన్‌ లో పేర్కొన్నారు. రాధా రవి పై ఆమె సంచలన ఆరోపణలు చేసిన కారణంగా ఆయన పరువు పోయింది. అందుకే ఆమె క్షమాపణలు చెప్పాలంటూ సంఘం సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ కండీషన్స్‌ పై చిన్మయి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మామూలుగా అసోషియేషన్‌ లో జాయిన్‌ అయ్యేందుకు 2500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాని నేను ఎందుకు 1.5 లక్షలు చెల్లించాలంటూ ప్రశ్నించింది. అంత డబ్బు కడితేనే నేను తమిళ ఇండస్ట్రీలో పని చేయవచ్చట, 12 ఏళ్లుగా నా వద్ద డబ్బులు తీసుకుంటున్న అసోషియేషన్‌ ఇప్పుడు ఇంత డబ్బు ఎందుకు డిమాండ్‌ చేస్తుంది. నన్ను టార్గెట్‌ చేసి, క్షమాపణలు చెప్పించేందుకు అసోషియేషన్‌ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అసోషియేషన్‌ కండీషన్స్‌ కు తాను ఒప్పుకునేది లేదు అంటూ చిన్మయి అంటోంది. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.
Tags:    

Similar News