స్కైప్‌ లో బట్టలు విప్పమన్నాడు : గాయిని

Update: 2020-10-09 11:45 GMT
ప్రముఖ గాయిని.. డబ్బింగ్‌ ఆర్టిస్టు చిన్మయి శ్రీపాద మీటూ ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ ఆడవారు ఇబ్బంది పడుతున్నారని తన దృష్టికి వచ్చినా ఎవరైనా ఆడవారు మోసపోయినట్లుగా లైంగిక వేదింపులు ఎదుర్కొన్నట్లుగా తెలిసినా కూడా వెంటనే స్పందిస్తుంది. ఆమె స్పందించడంతో పాటు ఆ విషయమై పోరాటం చేస్తుంది. ఇటీవల ఒక సింగర్‌ స్విర్జలాండ్‌ నుండి తాను ఒక ప్రముఖ గాయకుడి వల్ల ఇబ్బంది పడ్డాను ఆయన నన్ను స్కైప్‌ కాల్‌ లో బట్టలు విప్పమని అడిగాడు అంటూ ఆమె పేర్కొంది. ఆ విషయాన్ని చిన్మయి సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

ఒక రోజు నాకు ఎంతో ఇష్టమైన సింగర్‌ తో ప్లే బ్యాక్‌ సింగింగ్‌ అవకాశం వచ్చింది. ఆ సమయంలో చాలా సంతోషించాను. ఆయన స్కైప్‌ కాల్‌ లో మాట్లాడాలి అనగానే నాకు చాలా ఉత్సాహం గా అనిపించింది. ఆయన స్కైప్‌ ఐడీ తీసుకుని వెంటనే కాల్‌ చేశాను. ఆయన కొద్ది సమయం అయిన వెంటనే నీ డ్రస్‌ తీసేస్తే చూడాలని ఉందన్నాడు. దానికి షాక్‌ అయిన నేను మీరు ఇలా ఎలా మాట్లాడుతారు.

నేను ఈ విషయాన్ని మీడియా ముందుకు తీసుకు వెళ్తే మీ పరిస్థితి ఏంటీ అంటూ హెచ్చరించాను. అప్పుడు ఆయన ఎవ్వరు నమ్మరు అంటూ సమాధానం ఇచ్చాడు అంది. ఇదంతా కూడా 2019 ఏడాదిలో జరిగింది. ఈ విషయాన్ని చిన్మయి శ్రీపాద సోషల్‌ మీడియా ద్వారా అందరికి తెలియజేసింది. ఆ సింగర్‌ ను లైంగికంగా వేదించిన ఆ ప్రముఖ సింగర్‌ ఎవరై ఉంటారు అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న.
Tags:    

Similar News