డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాధారవి-గాయని చిన్మయి శ్రీపాద మధ్య వార్ గురించి తెలిసిందే. మీటూ వివాదంలో చిన్మయిని కార్నర్ చేశారన్న వాదనా వినిపించింది. వెటరన్ లిరిసిస్ట్ వైరముత్తుపైనా రాధారవిపైనా చిన్మయి రకరకాల ఆరోపణలు చేయడంతో అనంతర కాలంలో ఎన్ని ఇబ్బందులకు గురవ్వాల్సి వచ్చిందో తెలిసిందే. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి చిన్మయి బహిష్కరించారు. అటుపై రాధారవికి పోటీగా ఎన్నికల్లో చిన్మయి నామినేషన్ దాఖలు చేయడం.. అది రిజెక్ట్ కావడం ఇలా ప్రతిదీ కోలీవుడ్ సహా టాలీవుడ్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యాయి. డబ్బింగ్ అసోసియేషన్ కి రాధారవి అధ్యక్షుడిగా ఏకగ్రీవం అయ్యాక చిన్మయి ఫైరింగ్ వేడెక్కించింది.
కొన్ని గొడవలు.. కవ్వింతల తర్వాత తాజాగా చిన్మయికి రాధారవి ఓ ఆఫర్ ఇచ్చారు. స్చచ్ఛందంగా అందరి ముందు నిలబడి క్షమాపణలు అడిగితే మళ్లీ యూనియన్ లోకి తీసుకుంటామని ఆయన ప్రకటించారు..దానికి చిన్మయి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అతడిపై కౌంటర్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. రాధారవికి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పనని.. ఆ అవసరం తనకు లేదని కుండ బద్దలు కొట్టేసింది. దీంతో వివాదం మళ్లీ మొదటికే వచ్చినట్టయ్యింది. యూనియన్ సహా కోలీవుడ్ అంతా ఒకవైపు ఉంటే ...చిన్మయి మాత్రం ఒంటిరిగా పోరాటం సాగిస్తోంది. ఇప్పుడిప్పుడే వివాదం చల్లబడుతుందని అంతా భావిస్తున్న నేపథ్యంలో మరోసారి చిన్మయి కౌంటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
తప్పు ఎవరిది? ఎలా జరిగింది? అందుకు కారణమేంటి? అన్నది పక్కనబెడితే చిన్మయి మాత్రం ఈగోని విడిచిపెట్టక ఒంటెద్దు పొకడతో వెళుతోందని ఒక వర్గం నుంచి విమర్శలొస్తున్నాయి. పట్టు..విడుపు ఉండాలని చిన్మయికి సూచిస్తున్నారు. ఇండస్ట్రీలో లౌక్యం లేకపోతే కష్టం. లోన వివాదాలున్నా బయటకు అంతా పాజిటివ్ గానే కనిపించాలి. మరి ఇలాంటి లౌక్యం చిన్మయికి తెలియనిదా? అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు.