బాలీవుడ్ లో ప్రారంభం అయిన మీటూ ఉద్యమం సౌత్ లో శృతి హరిహరన్ మరియు చిన్మయిలు నెత్తికి ఎత్తుకున్నారు. కన్నడ స్టార్ హీరో అర్జున్ పై శృతి హరిహరన్ ఆరోపణలు చేయగా - గాయిని - డబ్బింగ్ ఆర్టిస్టు అయిన చిన్మయి ప్రముఖ రచయిత వైరముత్తు మరియు నటుడు - డబ్బింగ్ ఆర్టిస్టు అయిన రాధా రవిలపై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసింది. తనపైనే కాకుండా ఎంతో మందిపై కూడా వీరు లైంగిక వేదింపులకు పాల్పడ్డారు అంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. వారు వచ్చి చెప్పలేక పోతున్నారు. వారి తరపున నేను వారికి జరిగిన అన్యాయంను ప్రశ్నిస్తున్నట్లుగా చిన్మయి ఆ మద్య ఘాటుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
చిన్మయి మీటూ వ్యాఖ్యల పర్యావసానం ఇప్పుడు కనిపిస్తోంది. చిన్మయిని డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి తొలగిస్తున్నట్లుగా అధ్యక్షుడు రాధా రవి ప్రకటించాడు. రెండు సంవత్సరాలుగా ఆమె అసోషియేషన్ ఫీజు చెల్లించలేదు అంటూ పేర్కొంటూ చిన్మయిని తొలగించడం జరిగింది. తనపై డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ బ్యాన్ విధించడంపై చిన్మయి బాగా సీరియస్ అయ్యింది. రెండేళ్లుగా ఫీజు చెల్లించడం లేదు అంటున్నారు. మరి రెండు సంవత్సరాుగా నేను డబ్బింగ్ చెప్పగా వచ్చిన ప్రతి రూపాయిలోంచి 10 శాతం తీసుకుంటున్నారుగా అదేంటి మరీ అంటూ ప్రశ్నించింది.
ఫీజు చెల్లించడం లేదు అంటూ మొదట నోటీసులు జారీ చేసిఆ తర్వాత కూడా రెస్పాండ్ కాకుంటే బ్యాన్ చేయాలి తప్ప హఠాత్తుగా బ్యాన్ చేయడం అనేది వ్యక్తిగత కక్షతో చేసిందని చిన్మయి అంది. అధికారంను అడ్డం పెట్టుకుని నేను చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని, తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై తమిళ సినీ ప్రముఖులు ఎలా రియాక్ట్ అవుతారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.