ముందు ప్రభుదేవా, తర్వాత హృతిక్‌ -చిరు

Update: 2015-09-09 08:10 GMT
డ్యాన్సుల్లో చరణ్‌ గొప్పా? చిరంజీవి గొప్పా? ఇదే ప్రశ్న చిరంజీవిని అడిగితే ఏమని  చెప్పారో తెలుసా? నేనే గొప్ప డ్యాన్సర్‌ ని అని అన్నారు. మెగాస్టార్‌ లోని  కాన్ఫిడెన్స్‌ కి సూచికం ఇది. యువహీరోలతోనైనా పోటీపడతా.. అనే సందేశం ఇది. అయితే అసలు చరణ్‌, చిరు కంటే ఎవరు గొప్ప డ్యాన్సర్‌? అన్నదానికి చిరంజీవి సమాధానమిచ్చారు.

నాకంటే ప్రభుదేవా గొప్ప ప్రతిభావంతుడు. అతడు చాలా ఎత్తున ఉన్నాడు. ప్రభు యూనిక్‌ డ్యాన్సర్‌. తనని చిన్న వయసు నుంచి చూస్తూనే ఉన్నా. అతడి కంటూ ఓ స్టయిల్‌ ఉంది. 16ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకు ఓ పాటకి కొరియోగ్రఫీ అందించాడు. అప్పటికి తనకి పాస్‌ పోర్ట్‌ కూడా లేదు. విదేశాలు తీసుకెళతానంటే.. సుందరం మాష్టర్‌ .. ఆర్‌ యూ క్రేజీ? అంత నమ్మకం ఉందా తనపై? అంటూ ప్రశ్నించారు.  మీ అబ్బాయిపై నాకు నమ్మకం ఉందని చెప్పాను. ప్రభుదేవాని నేను నమ్మాను. కొరియోగ్రాఫర్‌ గా అతడు అంత చిన్న వయసులోనే నిరూపించుకున్నాడు... అటూ మెగాస్టార్‌ చెప్పుకొచ్చారు.

ప్రభుదేవా కాకుండా గొప్ప డ్యాన్సర్‌ ఎవరున్నారు? అన్న ప్రశ్నకి హృతిక్‌ రోషన్‌ అంటూ ఠకీమని చెప్పారు. హృతిక్‌ ఫెంటాస్టిక్‌. ఎబిలిటీ ఉన్న డ్యాన్సర్‌ అంటూ కితాబిచ్చారు. అయినా ప్రభుదేవా తర్వాతే హృతిక్‌ అన్నది కూడా చిరు మాటల్లో ధ్వనించింది. ఇప్పుడర్థమైందా.. ముగ్గురు స్టార్‌ డ్యాన్సర్ల కథా కమామీషు.
Tags:    

Similar News