మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలు కావడం.. ట్రైలర్ ను కూడా విడుదల చేయడంతో అంతటా 'సైరా' సందడే కనిపిస్తోంది. ఈ సినిమాను చిరు తన రీఎంట్రీ చిత్రం 'ఖైది నెం.150' రిలీజ్ అయిన తర్వాత ప్లాన్ చేశారు. సినిమాను ఫైనలైజ్ చేసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించేందుకు కూడా చాలా సమయం పట్టింది. ఇక షూటింగ్ కు కూడా ఎక్కువ సమయమే తీసుకుంది. దీనికి దాదాపుగా రెండున్నరేళ్ళ సమయం తీసుకుంది.
ఈ సినిమా నాన్నగారికి డ్రీమ్ ప్రాజెక్టులాంటిదని.. అందుకే క్వాలిటీ విషయం ఏమాత్రం రాజీపడకుండా.. బడ్జెట్ విషయంలో పట్టింపులు లేకుండా సినిమాను నిర్మించామని చరణ్ ఇప్పటికే రెండు మూడు సార్లు ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా కథ మెగాస్టార్ మనసులో 13 ఏళ్ళ నుంచి ఉందని సమాచారం. అప్పుడే చిరు ఈ సినిమా చేయాలనుకున్నారట. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఈ కథను ఆఖరి సినిమాగా చేయాలని అనుకున్నారట. అయితే అప్పట్లో ఈ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ లేకపోవడం.. బడ్జెట్ పరిమితులు కూడా ఉండడంతో పక్కన పెట్టారట.
ఇక చిరు తన రీ ఎంట్రీ సమయంలో కూడా మొదట ఇదే సినిమాను పరిశీలించారట. అప్పట్లో చిరు ఈ సినిమాను చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ చాలా ఆలోచించిన మీదట 'కత్తి' రీమేక్ కు ఓటు వేయడం జరిగిందని సమాచారం. 'ఖైది నెం.150' ఘన విజయం సాధించడం.. టాలీవుడ్ సినిమాల మార్కెట్.. బడ్జెట్ స్థాయి పెరడం తో ఫైనల్ గా 'సైరా' ను చేసేందుకు చిరు డిసైడ్ అయ్యారట. చిరు మనసులో ఈ కథ అన్నేళ్ల నుంచి ఉన్నది కావడంతో చెర్రీ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా భావించి టేకప్ చేశాడని.. బడ్జెట్ విషయంలో పరిమితులు పెట్టుకోలేదని సమాచారం. ఈ సినిమా కనుక కమర్షియల్ గా కూడా విజయం సాధిస్తే చిరు కు చరణ్ ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇదే అవుతుందనడంలో సందేహం లేదు.