ఆ నమ్మకం చిరుపైనా, చరణ్ పైనా!

Update: 2016-07-26 09:51 GMT
గతవారం విడుదలయిన రజనీకాంత్ కబాలి సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులు ఆ స్థాయి ఆతృతతో చూస్తున్న సినిమాల్లో చిరంజీవి 150వ చిత్రానికి ప్రథమస్థానమనే చెప్పుకోవాలి. చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై తన మెగారూపాన్ని ప్రదర్శించడానికి చిరంజీవి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు కూడా షూటింగ్ మొదలైనప్పటి నుండీ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీనికితోడు సోషల్ మీడియా నుంచి పబ్లిసిటీ కూడా ఆ స్థాయిలోనే నడుస్తుంది! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పబ్లిసిటీ సంగతి అటుంచితే.. నిర్మాత మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, శృతిమించరాదని చెప్పేవారే ఎక్కువ!!

సినిమా చిరంజీవిది - మెగాభిమానుల ఆశలు - ప్రేక్షకుల ఎదురుచూపులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి.. సినిమాకు మాంచి బిజినెస్ అవ్వడంలో సందేహమేమీ లేదు. ప్రస్తుతం అందుతున్న విషయాల ప్రకారం ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే స్టార్ట్ అయ్యిందని చెబుతున్నాయి సినీవర్గాలు. ఈ వార్తల ప్రకారం సీడెడ్ - గోదావరి జిల్లాలకు సంబంధించిన డీల్ ఇప్పటికే ఓకే అయ్యిందట. తెలుస్తున్న లెక్కల ప్రకారం తూర్పుగోదావరి ఏరియాలో రూ.5.5 కోట్లు - వైజాగ్ ఏరియాలో రూ. 7.2 కోట్లు - ఇలా చెప్పుకుంటూపోతే అన్ని ఏరియాల్లోనూ కలిపి సుమారు రూ.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనుందని చెబుతున్నారు.

అయితే.. ఈ సినిమాను ఈ స్థాయిలో ఎక్కువరేటు పెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకురావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయట. వాటిలో మెగాస్టార్ సినిమా కావడం ఒకటైతే.. రాం చరణ్ నిర్మాత కావడం మరో కారణమట. చరణ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తుండటం వల్ల.. రేపు ఏమైనా కాస్త అటు ఇటుగా జరిగినా కూడా ఆయన బాధ్యత తీసుకుంటారనే గట్టి నమ్మకం డిస్ట్రిబ్యూటర్స్ వ్యక్తపరుస్తున్నారట!! ఈ రెండు నమ్మకాలు వెరిసి చిరు 150వ సినిమా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందనేది తాజా సమాచారం!! ఏది ఏమైనా.. చిరు సంచలనాలు అప్పుడే మొదలైపోయినట్లేనని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారట!
Tags:    

Similar News