కొన్ని గంటల్లో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టుగా పట్టాలెక్కున్న ఆయన 151వ సినిమా గురించి నిర్మాత రామ్ చరణ్ అఫీషియల్ గా అన్ని రకాల వివరాలనూ తెలియజేయనున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ ఏమైయుంటుంది అనే ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పుడు మాత్రం ఒక టైటిల్ కొత్తగా వినిపిస్తోంది తెలుసా!!
అప్పట్లో ఈ సినిమాకోసం 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' 'ఉయ్యాలవాడ' 'రెడ్డన్న'.. వగైరా వగైరా చాలా టైటిల్స్ అనుకున్నారు. బ్రిటీష్ వారితో పోరాడే ఒక వీరుడు గాధగా దీన్ని చెబుతున్నారు కాబట్టి.. ఇండియా అంతటా రిలీజ్ చేసుకునే ఛాన్సు ఉంటుంది. అందుకే ఇప్పుడు మొత్తంగా అందిరికీ నచ్చేలా ఉండే టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. అందుకే రకరకాల పేర్లను పరిశీలించాక చివరకు ''సై..రా'' అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. 'సై రా' అంటే నేను రెడీ.. ఎస్ అనే తరహా అర్ధాలను మనం ఊహించుకోవచ్చు. పైగా అదేదో ఊత పదంలా ఉంటుంది కాబట్టి.. తమిళం అండ్ హిందీలో కూడా అదే టైటిల్ పెట్టేసుకోవచ్చు. అందుకే ఆ టైటిల్ ను చిరంజీవి ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. చూద్దాం ఎంతవరకు ఇది నిజమవుతుందో.
ఇకపోతే మంగళవారం ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజునాడు జరిగే ప్రెస్ మీట్ లో ఈ సినిమా టైటిల్.. మోషన్ పోస్టర్.. నటీనటులు.. సాంకేతిక నిపుణులు.. ఇలా అందరి పేర్లనూ ప్రకటించే వీలుంది. అది సంగతి.