మెగాస్టార్ బర్త్ డేని అమ్మేశారా?

Update: 2015-08-21 07:56 GMT
ఆగస్ట్ 22న చిరంజీవి అరవయ్యో పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని అంగరంగవైభవంగా జరిపేందుకు రంగం సిద్ధమవుతోంది. అభిమానుల కోసం ఒక ప్రోగ్రాం, సెలబ్రిటీల కోసం స్టార్ హోటల్ లో స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ పలు మేగజైన్లు, చానళ్లకు ఇంటర్వ్యూ లు కూడా ఇస్తున్నారు. చిరు బర్త్ డేని సూపర్ గా సెలబ్రేట్ చేసేందుకు చాలామంది సెలబ్రిటీలు కూడా సిద్ధంగానే ఉన్నారు. అంతా బాగుంది కానీ.. అందరూ ఈ ప్రోగ్రాంని డైరెక్టుగా చూసే అవకాశం ఉండదు.

లైవ్ టెలికాస్ట్ ల కోసం మనకు బోలెడన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఏదన్నా స్పెషల్ ప్రోగ్రాం అంటే చాలు... ఎక్స్ క్లూజివ్ అంటూ ప్రోమోలు వేసి హడావిడి చేసేందుకు రెడీగానే ఉంటాయి. ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డే వేడుకలని కూడా ఓ ఛానల్ లో ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం చేయబోతున్నారు. ఇలా వారికి మాత్రమే అంటే.. అప్పుడు ఇటు మెగా ఫ్యామిలీకి, ఆ ఛానల్ కి ఒప్పందం ఉండాల్సిందే. సాధారణంగా ఇలాంటి ప్రసార హక్కులను డబ్బులిచ్చి కొనుక్కుంటాయి ఛానల్స్..మరిప్పుడు అలాగే డబ్బులు తీసుకుని.. ఈ ఛానల్ రైట్స్ ఇచ్చారా ?

అంటే బర్త్ డే సెలబ్రేషన్స్ ని కూడా క్యాష్ చేసుకుంటున్నారా? అనిపిస్తోంది. ఇలా కాకుండా... అన్ని ఛానల్స్ కి ప్రసారం చేసుకునే అవకాశం ఇస్తే బాగుండేదని అనుకుంటున్నారు జనాలు.
Tags:    

Similar News