మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు.. మెగా-డే కు సంబంధించిన ఒక్కో అప్ డేట్ తెలుస్తూనే ఉంది. 21న శిల్పకళావేదికలో వేలాది మెగా ఫ్యాన్స్ మధ్య ఓ వేడుక, ఆగష్టు 22న పార్క్ హయత్ లో మరొక వేడుక జరగనున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే చెప్పుకున్నాం. అయితే ఈ వేడుకలు ఏ టీవీ చానెల్ లో లైవ్ టెలీకాస్ట్ అవుతాయన్నదే తేలలేదింకా. ఇప్పటి వరకూ ఫలానా చానెల్ లో లైవ్ చేస్తున్నాం అని ప్రకటించనేలేదు. కోట్లాదిమంది అభిమానులు వీక్షించే అవకాశమున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకం. కాబట్టి ముందే ఓ క్లారిటీ వస్తే బావుంటుందని అంతా అనుకుంటున్నారు.
ఈ వేడుకలకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. అంతేకాదు ఆటా పాటా, విందు వినోద కార్యక్రమాల్ని కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఓ ప్రముఖ టీవీ చానెల్ ఈ వేడుకల్ని కవర్ చేస్తుందని అంటున్నా, ఫలానా చానెల్ అని మాత్రం ఇంతవరకూ ఓపెన్‌గా రివీల్ చేయలేదు. అసలు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా జరుగుతున్న వేడుకలివి. పూర్తిగా ఫ్యామిలీ ఎఫైర్ ఇది. కాబట్టి చానెల్ లో లైవ్ ఉంటుందా? లేదా? రికార్డెడ్ ప్రోగ్రామ్ నే ఆ తర్వాత టెలీకాస్ట్ చేస్తారా? అసలింతకీ ఈ వేడుకల లైవ్ టెలీకాస్ట్ కోసం ఏ చానెళ్లు పోటీపడుతున్నాయి? హక్కుల్ని చేజిక్కించుకుంది ఎవరు? ఇలాంటి సందేహాలెన్నో అందరికీ ఉన్నాయి. మామూలుగా అయితే మా-టివిలో రావాలి.. లేకపోతే టివి9లో.. ఇప్పడు మరి ఏ ఛానల్లో వస్తుందో ఏంటి.. మెగా క్యాంప్.. గివజ్ ఏ క్లారిటీ!!