బెంగాల్ టైగర్ ప్రస్తుతం డిష్కసన్ పాయింట్. ఈ మూవీ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చక్కని ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీలో కొన్ని సన్నివేశాల్లో చెప్పించిన డైలాగులు కొందరు సూపర్ స్టార్ల అభిమానుల్ని హర్ట్ చేశాయని చెబుతున్నారు. సౌత్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి పెద్ద స్టార్ పవన్ కల్యాణ్ అని ఓ డైలాగులో చెప్పించాడు సంపత్. సినిమా ఆద్యంతం పవన్‌కి భజన చేసే పని పెట్టుకున్నాడు.
అయితే అది ఇతర హీరోల ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేసిందని చెబుతున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్, సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్టయ్యారన్నది రిపోర్ట్. అసలు రజనీ తర్వాత పవన్ అనే విశ్లేషణ ఎంతవరకూ సబబు. అందులో లాజిక్ ఉందా? అని వెతికితే అదో పెద్ద బ్లండర్ అని తేలింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి ధీటుగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఆయన సమకాలికుడిగా ఆయనతో సమానంగా సినిమాలు చేసిన చరిత్ర చిరంజీవిది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన స్టార్‌డమ్ అతడిది. అది మర్చిపోయి సంపత్ ఆ డైలాగ్ ఎలా చెప్పించాడని చిరు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రజనీకాంత్ ప్రస్థావన తేకుండా కనీసం చిరంజీవి తర్వాత పవన్ అని అన్నా అది రీజనబుల్‌గా ఉండేదని విశ్లేషిస్తున్నారు. అలాగే దేశంలోనే టాప్-3 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది బాహుబలి. ఈ సినిమాతో ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదిగాడు. అతడి కంటే పవన్ గొప్పా అన్న ఇజం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉందిప్పుడు. అందుకే మిస్టర్ పెర్ఫెక్ట్ ఫ్యాన్స్ సంపత్ పై కాస్త కోపంగానే ఉన్నారు.
ఇకపోతే మహేష్ పవన్ కంటే ఎందులో తీసిపోయాడు. ఓవర్సీస్‌తో పాటు ఇతరత్రా భాషల్లోనూ మహేష్ అంతకంతకూ స్టామినా పెంచుకుంటూ ముందుకెళుతున్నాడు. ఈ విషయంలో పవన్ ఎంతో వెనకబడ్డాడు. నిన్నటి ఫోర్బ్స్ జాబితా చూస్తే.. కాసుల వేటలో ఫేం బాటలో మహేష్ బాబే నెం.1 అని చెప్పక తప్పదు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఆ డైలాగులు యాప్ట్ కాదన్న విమర్శలొస్తున్నాయి. మరి వీటన్నిటికీ సమాధానంగా సంపత్ ఏం చెబుతాడో చూడాలి.