మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' చిత్రాన్ని వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్.. ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత ట్రైలర్ ని రిలీజ్ చేయించారు. ఇదే క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు (ఫిబ్రవరి 6) సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు.
ఇప్పటికే 'ఉప్పెన' చిత్రాన్ని చూసిన చిరంజీవి.. ఈ కార్యక్రమంలో సినిమా విశేషాలను తెలపడంతో పాటు తన మేనల్లుడికి తన ఆశీస్సులు అందజేయనున్నారు. చిరంజీవి ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారందరినీ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు తన మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీకి తనవంతు బాధ్యత నిర్వర్తించనున్నారు. వాస్తవానికి ఈ చిత్ర స్ర్కిప్ట్ తన మేనల్లుడి కోసం ఫైనల్ చేసింది చిరంజీవి అని ఇటీవల దర్శకుడు వెల్లడించారు. ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర బృందంతో పాటు మిగతా మెగా హీరోలు కూడా అటెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, 'ఉప్పెన' చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.