మెగా ఈవెంట్ హోరెత్తిపోయింది. ఓవైపు సెలబ్రిటీలతో రంగుల మయం అయ్యింది. ఈ వేడుకలకు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి దిగ్గజాలు దిగి వచ్చారు. వచ్చినవాళ్లంతా మెగాస్టార్ ముంగిట ఆశీనులై వేదికపై జరుగుతున్నదంతా కనులారా వీక్షించారు. వేదికపై చిరు ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు.
మేనల్లుడు అల్లు అర్జున్, తనయుడు రామ్ చరణ్ ఒకానొక సందర్భంలో చిరుని రెండు వైపులా ఎత్తుకుని ఆకాశానికెత్తేశారు. ఆనందాన్ని పీక్స్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ పక్కనే సాయిధరమ్, శిరీష్, వరుణ్ తేజ్ ఇంతమంది యువహీరోలు గోల గోల చేశారు. ఎట్టకేలకు ఈ వేడుకకు పవన్ వచ్చాడు. బాలీవుడ్ దిగ్గజాలు అభిషేక్‌బచ్చన్ - జయాబచ్చన్ - శత్రుఘ్న సిన్హా - శ్రీదేవి - టబు - జయప్రద విచ్చేశారు. టాలీవుడ్ నుంచి బాలకృష్ణ, వెంకటేష్ - మోహన్ బాబు - నాగార్జున ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుక ఆద్యంతం వీక్షించారు సెలబ్స్.
ఆ చివరిలో అరుదైన వంటకాలతో విందును ఆరగించి సెలవు తీసుకున్నారు. మెనూలో చిరుకి ఇష్టమైన వంటకాల్ని ఎరేంజ్ చేశారు. ముంబై నుంచి ఓ ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ ఏర్పాట్లు చూసుకుంది. అదీ సంగతి.