మగధీర కంటే ధృవలో ఇంకా బెటర్

Update: 2016-12-16 04:06 GMT
రామ్ చరణ్ మూవీ ధృవ సూపర్ సక్సెస్ దూసుకుపోతోంది. వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ అంతగా డ్రాప్ కాకపోవడంతో.. లాంగ్ రన్ మూవీ అంటున్నారు థియేటర్ జనాలు. ఈ మూవీకి అసలు సిసలైన అట్రాక్షన్.. మెగా పవర్ స్టార్ సిక్స్ ప్యాక్ చేయడం. అసలు సిక్స్ ప్యాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాడు చెర్రీ.

'మగధీర.. తుఫాన్ లకు కూడా సిక్స్ ప్యాక్ చేద్దామని అనుకున్నా. కానీ తప్పనిసరి కాదనే ఉద్దేశ్యంతో వదిలేశాను. స్క్రిప్ట్ ఫైనలైజేషన్ లో భాగంగా.. స్క్రిప్ట్ కు మనం ఎక్కువగా చేయాల్సింది ఏమీ లేదని.. కానీ కేరక్టర్స్ కి మాత్రం ఎంతో చేయచ్చని చెప్పాడు సురేందర్ రెడ్డి. అష్టదిగ్బంధనం కాన్సెప్ట్ ను మొదట్లోనే చెప్పేశాడు. అలాగే మొదటి సీన్ లోనే విలన్ ఎంత తెలివైన వాడో తెలిసిపోతుంది. అలాంటి వాడిని ఎదుర్కునేందుకు.. శారీరకంగా మానసికంగా అంతకంటే ధైర్యం ఉన్న హీరో కావాలి. చూడగానే అలా అనిపించాలి. అందుకే సిక్స్ ప్యాక్ చేయమని చెప్పాడు సురేందర్ రెడ్డి' అంటూ సిక్స్ ప్యాక్ సీక్రెట్ విప్పేశాడు చరణ్.

మరి ధృవకు చిరంజీవి బోలెడన్ని సజెషన్స్ ఇచ్చారనే టాక్ ఉందిగా అనే మాట కూడా చెర్రీ ఫేస్ చేయాల్సి వచ్చింది. 'నా గత 7 సినిమాల్లోనూ దేనిపైనా నాన్న ఎప్పుడూ విమర్శించలేదు. మంచి విషయాలను ప్రశంసిస్తారంతే. ఫెయిల్యూర్స్ ను తప్పు పట్టరు. రాబోయే జెనరేషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలన్నది ఆయన ఫీలింగ్. నాతో కలిసి నా సినిమాల డీవీడీలు చూసి తప్పొప్పులు చెప్పమని అమ్మ అంటూ ఉంటుంది. కానీ నాన్న మాత్రం నన్ను నేనే వెలికి తీసుకోవాలని అంటారు. స్పూన్ ఫీడింగ్ విషయంలో ఆయన వ్యతిరేకం' అంటూ చెప్పుకొచ్చాడు చరణ్.

కాకపోతే అమెరికా నుండి మనోడు రాగానే ఒక మాట అన్నారట మెగాస్టార్. ''మగధీర సినిమాలోకంటే ధృవ సినిమాలో నీ పెర్ఫామెన్స్ చాలా బాగుంది అన్నారు నాన్నగారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను.. ఆయన నా గత సినిమాలకు ఒక్కసారి కూడా ఇలాంటి కాంప్లిమెంట్ ఇవ్వలేదని. డాడ్ నా యాక్టింగ్ చూసి ప్రౌడ్ గా ఫీలైతే అది నాకు కూడా గర్వకారణమే కదా''

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News