ఇంతకీ తన బర్తడే సందర్భంగా అసలు మెగాస్టార్ చిరంజీవి ఏం చేస్తున్నారు అనే సందేహం అందరికీ వచ్చే ఉంటుంది. అయితే ఆయన నిన్న అస్సలు కనిపించలేదు కాబట్టి.. ఎక్కడో సీక్రెట్ గా తన పుట్టినరోజు జరుపుకున్నారు అనుకున్నారు. కాని రాత్రి హైదరాబాదులోని ఒక సెవెన్ స్టార్ హోటల్లో జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలకు ఆయన విచ్చేశారు. ఇదే ఈవెంటుకు టాలీవుడ్ లోని చాలామంది అగ్రహీరోలు కూడా వచ్చారులే. మహేష్ బాబు నుండి రవితేజ వరకు.. ఇలా అందరూ అక్కడే కనిపించారు. కాకపోతే నిన్న డే అంతా మెగాస్టార్ ఏం చేశారో తెలుసా?
చక్కగా పూజలు చేసుకుని.. ఆ తరువాత సిటీకి చివర్లో ఉన్న తన ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకున్నారట చిరంజీవి. ఉత్తుత్తి రెస్ట్ మాత్రమే కాదండోయ్.. హ్యాపీగా ఆయన సదరు ఫామ్ హౌస్ కు ఆనుకుని ఉన్న కొలనులో చేపలు పట్టారు కూడా. ఈ ఉదయం మళ్ళీ అక్కడికే చేరుకుని అదే పనిలో నిమగ్నమయ్యారు. గత మూడు నెలల నుండి 150వ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న చిరు.. ఖైదీ నెం 150కు కాస్త బ్రేక్ ఇచ్చి.. ఇప్పుడు హ్యాపీగా అలా చేపలు పడుతున్నారు. ఏదేమైనా ఈ పిక్చర్ చూస్తే మాత్రం చాలా కిరాక్ గా ఉందంతే. మెగాస్టారా మజాకానా.. మెగా చేపలన్నీ పట్టేస్తున్నారు సుమీ!!