అస‌లు నేను ఈ నేల‌మీద లేను అంటే ఒట్టు!

Update: 2019-09-23 07:42 GMT
దాదాపు 41 సంవ‌త్స‌రాల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఎంతో టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌. మ‌ళ్లీ ఇన్నాళ్టికి అది మ‌రోసారి త‌న‌లో కనిపించింద‌ని అన్నారు. అయితే అందుకు కార‌ణ‌మేంటి? అంటే.. 22 సెప్టెంబ‌ర్ 1978న చిరంజీవి న‌టించిన మొట్ట‌మొద‌టి చిత్రం `ప్రాణం ఖ‌రీదు` రిలీజైంది. ఆరోజు ఏదో మీమాంశ‌.. తెలియ‌ని ఉద్వేగం.. ఉత్కంఠ‌.. మిక్స్ డ్ ఫీలింగ్... అస‌లు నేను ఈ నేల‌మీద లేను అంటే ఒట్టు! అని చిరు అన్నారు.

అలాంటి టెన్ష‌న్ 41 సంవ‌త్స‌రాల త‌ర్వాత తిరిగి రిపీటైంద‌ని చిరు తెలిపారు. ఆదివారం సాయంత్రం సైరా ప్రీరిలీజ్ వేడుక స్పీచ్ లో చిరు ఎంతో ఎమోష‌న్ అయ్యారు. తెలీని ఉద్వేగానికి లోన‌య్యారు. నాలుగు ద‌శాబ్ధాల త‌ర్వాత మ‌ళ్లీ త‌న మొదటి సినిమా జ్ఞాప‌కాల్ని ఈ వేదిక‌పై గుర్తు చేసుకుని ఉద్విగ్న‌త‌కు గుర‌య్యారు.

పుష్క‌ర కాలం క్రితం నా మ‌న‌సులో మొద‌లైన ఆలోచ‌న అది. నేను స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి పాత్ర‌లో న‌టించాల‌ని అనుకున్నాను. అది కెరీర్ బెస్ట్ గా ఉండాల‌నుకున్నా. భ‌గ‌త్ సింగ్ కావాల‌ని అనుకున్నా. కానీ ఏ నిర్మాత .. ఏ ద‌ర్శ‌క‌ ర‌చ‌యితా నా వ‌ద్ద‌కు స్క్రిప్టుతో రాలేదు. పుష్క‌ర‌కాలం ముందు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఉయ్యాల‌వాడ క‌థ‌తో వ‌చ్చారు... అని తెలిపారు. మొత్తానికి నాలుగు ద‌శాబ్ధాల కెరీర్ లో తొలిసారి మెగాస్టార్ చిరంజీవి ఒక స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా న‌టించారు. అక్టోబ‌ర్ 2న సైరా న‌ర‌సింహారెడ్డి రిలీజ్ కి వ‌స్తోంది. మ‌రి ఈ చిత్రం ఆశించిన స్థాయి విజ‌యాన్ని అందించి అదే ఉద్వేగాన్ని మ‌రోసారి రిపీట్ చేస్తుందా అన్న‌ది వేచి చూడాలి.


Tags:    

Similar News