మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'గాడ్ ఫాదర్'. నయనతార - సత్యదేవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తని ఒరువన్ ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమా ప్రచారం కార్యక్రమాలు అంతంత మాత్రమేనని విమర్శలొస్తున్నాయి. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మాత్రమే సోలో ఇంటర్వ్యూలతో గాడ్ ఫాదర్ కి ప్రచారం చేయడంపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.
ఆచార్యకు ప్రచారార్భాటం ఎక్కువైనా అది ఏమాత్రం కలిసి రాలేదు. ఫలితం తేడా కొట్టింది. అందుకే ఇప్పుడు అలా కాకుండా సాఫ్ట్ గా ఎంత ప్రచారం కావాలో అంతవరకే గాడ్ ఫాదర్ టీమ్ ప్రచారం కోరుకుంటోందని గుసగుస వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రచారానికి ఎలాంటి డోస్ అవసరమో.. ఎక్కడ ఎంత చేయాలో మెగాస్టార్ డిసైడ్ చేసారని అందుకే తొలిగా ఆయన ప్రచారం ప్రారంభించి .. రిలీజ్ ని సజావుగా సాగేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే అందాల యాంకర్ శ్రీముఖికి ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన మెగాస్టార్ ఎంతో ఎగ్జయిటింగ్ గా కనిపించారు. అలాగే ప్రముఖ జర్నలిస్ట్ అనుపమ్ చోప్రాకు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. ఈ రెండిటితో గాడ్ ఫాదర్ కి కావాల్సినంత బూస్ట్ దక్కింది. ఇప్పటివరకూ లేని ప్రచారం బజ్ ఇప్పుడు అమాంతం పెరిగింది. ప్రస్తుతం చిరు క్లాసీ లుక్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. సీరియస్ యాక్షన్ దృశ్యంలో అతడు శత్రువుతో తలపడుతూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది.
సింపుల్ టెక్నిక్ తోనే ప్రచారంలో హైప్ ని పెంచారు చిరు. తాజాగా రెండు ఇంటర్వ్యూలు థార్ మార్ ఠక్కర్ మార్ పాట తో చిరు స్వయంగా ట్విట్టర్ లో పంచుకోగా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లాయి. అయితే ఇప్పటివరకూ చిరు మాత్రమే ప్రచారం చేయగా ఇకపై ఇతర చిత్రబృందం ప్రచారంలోకి దిగనుందని తెలిసింది.
దర్శకుడు మోహన్ రాజా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.. మధ్యలోనే ఆయన ఇంటర్వ్యూని పీఆర్ టీమ్ ప్లాన్ చేయనున్నారని తెలిసింది. ప్రచారంలో అతడి పాత్ర పరిమితం అయినా కానీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ సహా ఇతర ఆర్టిస్టులతో ప్రచారం చేసే వీలుందని తెలిసింది.
అయితే ఈ చిత్రంలో కీలక పాత్రధారి నయనతార ప్రచారానికి వస్తున్నారా? అంటే ఇప్పుడే చెప్పలేం. నయన్ తన సినిమాలకు ప్రచారం చేసేందుకు నిరాకరిస్తుంది. దర్శకనిర్మాతలకు ఆ విషయాన్ని ఒప్పందానికి ముందే ఖరాకండిగా చెప్పేస్తుంది. ఇంతకుముందు సైరా - నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రానికి నయన్ ప్రచారం చేయలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందా? అంటే అవుననే గుసగుస వినిపిస్తోంది. మూవీ రిలీజ్ కి ఇంకో వారం మాత్రమే ఉంది. ఈలోగా కీలక నటీనటులందరితో ప్రచారం చేయిస్తారా? లేదా అన్నది గాడ్ ఫాదర్ టీమ్ వెల్లడించాల్సి ఉంది. మరీ అతి ప్రచారం వద్దనుకోవడం వల్లనే వీళ్లెవరినీ పిలవలేదా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఆచార్య అనుభవాల దృష్ట్యా ఈసారి చిరు అండ్ టీమ్ గేమ్ ప్లాన్ మార్చారనే భావించాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.