మోహన్ బాబుపై 'మెగా' కామెంట్‌

Update: 2015-08-21 14:19 GMT
మంచు మోహన్‌ బాబు కెరీర్‌ మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌ తో ప్యారలల్‌ గా సాగిందన్న సంగతి తెలిసిందే. ఒకరు హీరో అయితే, మరొకరు విలన్‌ గా రాణించారు. ఆ క్రమంలోనే చిరు - మోహన్‌ బాబు బంధం కూడా బలపడింది. అయితే కాలక్రమంలో ఈ ఇద్దరి మధ్యా రకరకాల సందర్భాల్లో విభేధాలొచ్చాయి. అవి తారాస్థాయికి వెళ్లాయి. అప్పట్లో టాలీవుడ్‌ వజ్రోత్సవాల వేళ చిరుపై మోహన్‌ బాబు ఫైర్‌ పెద్ద చిచ్చు రేపింది. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య వార్‌ కొనసాగింది. అయితే ఆ ఎపిసోడ్‌ అంతా గతం గత:.

ప్రస్తుతం చిరు, మోహన్‌ బాబు ఇద్దరూ ఫ్రెండ్సే. ఎక్కడ కనిపించినా పలకరించుకోవడాలు, పట్టించుకోవడాలు చూస్తూనే ఉన్నాం. అయితే మెగాస్టార్‌ చిరంజీవి 60వ పుట్టినరోజు సందర్భంగా చిరు ఓ చానెల్‌ తో మాట్లాడుతూ ఏమన్నారంటే... మోహన్‌ బాబుపై ఆసక్తికరమైన కామెంట్‌ చేశారు.  మోహన్‌బాబు మనసులో ఏదో పెట్టుకుని మాట్టాడడు. అతడే వ్యాఖ్యలు చేసినా పట్టించుకోనక్కర్లేదు. మోహన్‌ బాబు తాటాకు మంట లాంటోడు.. అంటూ మనసులోని మాట చెప్పారు చిరు. తాటాకు మంట మీన్స్‌ .. చప్పున చల్లారిపోయేవాడు, మనసులో దురుద్ధేశం లేనివాడు అని అర్థం అనుకోవచ్చు.

ఈ కామెంట్లన్నీ చూస్తుంటే.. రేపు మెగా బర్తడే బ్యాష్‌ లో ఈ దోస్తులిద్దరూ ఎంత హడావుడి చేస్తారో అనిపిస్తోంది కదూ...
Tags:    

Similar News