వాల్తేర్ వీరయ్య.. చూసి నేర్చుకోవాలా?

Update: 2023-01-15 04:30 GMT
వాల్తేర్ వీరయ్య సినిమా థియేటర్స్ లో మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. కమర్షియల్ సినిమా అయినా కూడా చాలా కాలం తర్వాత చిరంజీవిని మరోసారి పవర్ ఫుల్ రోల్ లో ప్రేక్షకులని చూసే అవకాశం వచ్చింది. కామెడీ టైమింగ్, డాన్స్ లో గ్రేస్ కూడా ఒకప్పటి చిరంజీవిని వాల్తేర్ వీరయ్య సినిమాలో చూపించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ మీట్ లో వాల్తేర్ వీరయ్య సినిమా గురించి చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవి గట్టిగా ఎవరి మీద విమర్శలు చేయరు. కాని ఏదైనా మనసులో ఉంటే నవ్వుతూనే తనకి ఎవరి మీద కోపం ఉందో వారి మీద సుతిమెత్తగా విమర్శలు చేసేస్తారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

తాజాగా వాల్తేర్ వీరయ్యని ఉద్దేశించి చిరంజీవి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ మూవీని ప్రస్తుతం ఉన్న చాలా మంది దర్శకులు కేస్ స్టడీగా తీసుకోవాలని అన్నారు. అయితే ఒక కమర్షియల్ సినిమాని ఏ విధంగా కేస్ స్టడీగా తీసుకుంటారు అనే విమర్శలు ఒక వర్గం నుంచి వినిపిస్తున్నాయి. రొటీన్ కమర్షియల్ సినిమాలో ఎలాంటి కొత్తదనం లేని కాన్సెప్ట్ తో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య కేస్ స్టడీ ఎలా అవుతుందని అంటున్నారు. అయితే చిరంజీవి ఈ వ్యాఖ్యల వెనుక వేరే ఉద్దేశ్యం ఉంది. ప్రస్తుతం ఉన్న దర్శకులలో చాలా మంది సినిమా షూటింగ్ విషయంలో ఒక క్లారిటీ అంటూ లేకుండా రెండు గంటల సినిమా కోసం 5 గంటల నిడివి ఉన్న అవుట్ పుట్ ని షూట్ చేస్తారు. ఆ ఐదు గంటల సినిమాని ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని రెండు గంటలకి తగ్గిస్తారు. ఇలా చేయడం వలన మూడుగంటల సినిమా కంటెంట్ కంప్లీట్ గ వేస్ట్ అయినట్లే.

ఈ స్థాయిలో వేస్ట్ చేయడం వలన నిర్మాతలకి ప్రొడక్షన్ ఖర్చు పెరిగిపోతుంది. ఫైనల్ గా సినిమా హిట్ అయిన కూడా పెట్టిన బడ్జెట్ తిరిగి రాదు. దర్శకులు నిర్మాతలని దృష్టిలో ఉంచుకొని వారు పెట్టె ప్రతి రూపాయికి లెక్క చెప్పే విధంగా రెండు గంటల సినిమా అంటే మహా అయితే మరో 20 నిమిషాల ఎపిసోడ్ ఎక్కువగా ఉండే విధంగా చేసుకొనేలా స్క్రిప్ట్ పెర్ఫెక్ట్ గా ఉండాలి. అలా ఉంటే షూటింగ్ వేగంగా కంప్లీట్ అవుతుంది. అనవసరమైన సీన్స్ షూట్ చేయాల్సిన అవసరం ఉండదు. నిర్మాతలకి ప్రొడక్షన్ ఖర్చు తగ్గించిన వారు అవుతారు. దర్శకుడు బాబీ వాల్తేర్ వీరయ్య సినిమా నిడివి కంటే 15 నిమిషాల నిడివి ఉన్న అవుట్ పుట్ మాత్రమే ఎక్స్ ట్రాగా షూట్ చేశాడు. దీని వలన ప్రొడక్షన్ ఖర్చుభాగా సేవ్ అయ్యింది. ఈ విషయంలో వాల్తేర్ వీరయ్యని దర్శకులు కేస్ స్టడీగా తీసుకోవాలని చిరంజీవి చెప్పారు.
Tags:    

Similar News