చిరు చెప్ప‌డంతోనే ఐఫా వ‌చ్చిందా?

Update: 2016-01-26 13:30 GMT
ఐఫా గురించి మ‌నం కొత్త‌గా మాట్లాడుకొంటున్నాం కానీ బాలీవుడ్‌ లో మాత్రం ప‌ద‌హారేళ్లుగా ఈ అవార్డుల్ని ఇస్తున్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో జ‌రిగే ఐఫా పుర‌స్కారాలంటే బాలీవుడ్ తార‌లు ఎగిరి గంతేస్తుంటారు. ఈ వేడుక‌ల‌కి చాలా ప్రాధాన్య‌మిస్తుంటారు. షారుఖ్ మొద‌లుకొని తార‌లంతా కూడా డ్యాన్సు పెర్ఫార్మెన్సుల‌తో హ‌ల్‌ చ‌ల్ చేస్తుంటారు. ఇండియా సినిమాల‌కి సంబంధించే అయినా విదేశాల్లోనే ఎక్కువ‌గా ఈ వేడుక‌ల్ని నిర్వ‌హిస్తుంటారు. అంతటి చ‌రిత్ర ఉన్న ఐఫా తొలిసారి ద‌క్షిణాదికి వ‌చ్చింది. ఇక్కడి టాలెంట్‌ నీ గుర్తించింది.

అయితే ఇన్నాళ్లూ సౌత్‌ కి రాని ఈ అవార్డులు ఇప్పుడెందుకు వ‌చ్చాయ‌నే సందేహం చాలామందికి ఉంది. కొద్దిమంది మాత్రం ఇప్పుడైనా మ‌నల్ని ఓ అంత‌ర్జాతీయ సంస్థ గుర్తించింది కాబ‌ట్టి సంతోష‌ప‌డాలి అంటుంటారు. ఏదైనా తొలి ఐఫా వేడుక హైద‌రాబాద్‌ లో ఘ‌నంగా జ‌రిగింది. నాలుగు ఇండ‌స్ట్రీల‌కి చెందిన తాల‌రంతా హైద‌రాబాద్‌ లో త‌ళుక్కున మెరిశారు. అయితే చిరంజీవి మాత్రం ఐఫా నావ‌ల్లే ఇక్క‌డికి వ‌చ్చిందంటున్నారు. నిన్న జ‌రిగిన వేడుక‌కి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఓ టీవీ ఛాన‌ల్‌ తో మాట్లాడుతూ ``ఇదివ‌ర‌కు నేను కేంద్ర టూరిజం శాఖ‌మంత్రి హోదాలో  విదేశాల్లో జ‌రిగిన ఐఫా వేడుక‌ల‌కి వెళ్లాను. అక్క‌డ ఐఫా యాజ‌మాన్యాన్ని క‌లిసి మా సౌత్‌ లో ఈ వేడుక‌ల్ని ఎందుకు జ‌ర‌ప‌కూడ‌దు? అన్నా. వాళ్లు...  త్వ‌ర‌లోనే అక్క‌డకీ వ‌స్తాం అన్నారు. అన్న‌ట్టుగానే ఇప్పుడు వ‌చ్చేశారు. అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలున్న ఇలాంటి అవార్డు వేడుక‌లు హైద‌రాబాద్‌ లోనూ త‌ర‌చుగా జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉంది`` అన్నారు. తొలి ద‌క్షిణాది ఐఫా వేడుక‌ని చిరు ఫ్యామిలీ ద‌గ్గ‌రుండి జ‌రిపింది. అల్లు శిరీష్ హోస్ట్‌ గా వ్య‌వ‌హ‌రించాడు. అల్లు అర్జున్‌ - సాయిధ‌ర‌మ్ తేజ్‌ లాంటి మెగా హీరోలు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యాడు. చ‌ర‌ణ్ డ్యాన్స్ షో కూడా చేశాడు.
Tags:    

Similar News