మెగా 150కి ఇవాల్టితో 100 డేస్

Update: 2017-04-20 05:12 GMT
ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగాభిమానుల రచ్చ అంతా ఒకటే. మెగాస్టార్ కం బ్యాక్ మూవీ.. చిరు 150వ చిత్రం.. ఖైదీ నంబర్ 150 ఇవాల్టితో 100 రోజులు పూర్తి చేసుకుంది. అందుకే #100DaysForKhaidiNo150 అనే హ్యాష్ ట్యాగ్ ను టాప్ ట్రెండింగ్ లోకి తీసుకెళ్లిపోయారు.

ఈ చిత్ర నిర్మాత.. మెగా పవర్ స్టార్ కూడా వందో రోజుకు కొన్ని గంటల ముందే.. ఈ హ్యాష్ ట్యాగ్ ను కోట్ చేసి.. తన ఆనందాన్ని తెలియచెప్పాడు. 'మీ మెగాస్టార్ తో పాటు 100 రోజల డ్రీమ్ రన్ ను కూడూ వెనక్కు తీసుకొచ్చేయడం రియల్లీ గ్రేట్. మీరు చూపిన అదే అభిమానం.. సానుకూలత.. డాడీతో మరో ప్రయాణం ప్రారంభించడానికి కారణమైంది. అతి త్వరలో' అంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు చెర్రీ. ఇన్ డైరెక్ట్ గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ గురించి చెప్పాడులే.

అయితే.. సోషల్ మీడియాలో మాత్రం #100DaysForKhaidiNo150 రచ్చ మామూలుగా లేదు. నేషనల్ లెవెల్ లో కూడా టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసిందంటే.. మెగా ఫ్యాన్స్ సంబరాలు ఏ రేంజ్ లో ఉన్నాయనే సంగతి అర్ధమవుతుంది. ముఖ్యంగా.. 10 ఏళ్లపాటు చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నా.. ఒక తెలుగు సినిమా 100 కోట్ల షేర్ అనే మార్క్ ను అందుకోవడం.. ఆయన తిరిగొచ్చేవరకూ ఎవరూ సాధించలేకపోయారనే పాయింట్ ను మాత్రం మెగా ఫ్యాన్స్ బాగా హైలైట్ చేసేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News