ఖైదీ ప్రమోషన్లలో గేర్ మార్చిన చిరు

Update: 2017-01-15 10:51 GMT
తొమ్మిదేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఖైదీ చిత్రంతో బాక్స్ ఫీస్ లను ఎంతగా షేక్ చేస్తున్నది తెలిసిందే. రికార్డు కలెక్షన్లతో దూసుకెళుతున్న ఈ సినిమా వసూళ్లు సరికొత్తరికార్డుల్ని సృష్టిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందు మీడియాలో ప్రముఖంగా దర్శనం ఇచ్చిన చిరు.. వివిధ టీవీ ఛానళ్లలో సోలోగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వటం.. రీల్ లోనే కాదు.. రియల్ గా కూడా సినిమా ప్రమోషన్ వర్క్ బాధ్యత మొత్తాన్ని తన భుజస్కందాల మీద వేసుకొని నడిపించటం తెలిసిందే.

లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావటం.. అది కూడా చిరు 150వ సినిమా కావటంతో  ఖైదీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అందుకే.. సినిమా ప్రచారంలోనూ మొత్తంగా తానొక్కరే కనిపించారు. సినిమా విడుదలయ్యాక.. సక్సెస్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత మళ్లీ చిరంజీవి కనిపించలేదన్న మాట వినిపించింది. అంతేకాదు.. ప్రమోషన్ వర్క్ లో దర్శకుడికి కూడా అవకాశం ఇవ్వకుండా చిరు ఒక్కరే అంతటా కనిపించారన్న అభిప్రాయం వ్యక్తమైంది.

మరీ విషయాలపై బయట అనుకున్న మాటలు చిరు క్యాంప్  దృష్టికి వెళ్లినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి నెగిటివ్ మాటలు మంచిది కాదన్న ఉద్దేశమా.. లేక.. వ్యూహాత్మకంగానే తమ ప్లాన్ బిని అమలు చేశారేమో కానీ.. తాజాగా మలి విడత సినిమా ప్రమోషన్ ను మొదలెట్టారు. ఇందులో భాగంగా పలు ఛానళ్లకు తాము తయారు చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ఫీడ్ ఇచ్చారు. ఈసారి నాగబాబు కుమార్తె పెదనాన్న చిరును ఇంటర్వ్యూ చేయటం.. అందులోనే దర్శకుడు వినాయక్.. నిర్మాత చెర్రీ కూడా ఉండటం గమనార్హం. చూస్తుంటే.. ఖైదీ తాజా ప్రమోషన్ వర్క్ లో చిరు గేరు మార్చినట్లుగా కనిపించట్లేదు.

Full View
Tags:    

Similar News