మెగాస్టార్ చిరంజీవి మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్కడ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ని హోమ్ బ్యానర్ లో రామ్ చరణ్ - ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ముందుగా ఈ రీమేక్ బాధ్యతలు యువ దర్శకుడు సుజీత్ కి అప్పగించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ తప్పుకోవడంతో మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతిలోకి వెళ్ళింది. చివరగా తమిళ దర్శకుడు మోహన్ రాజా కి తెలుగు 'లూసిఫర్' కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై ఆసక్తికరమైన న్యూస్ సర్క్యులేట్ అవుతోంది.
మెగా రీమేక్ కి ''బైరెడ్డి'' అనే టైటిల్ పెడుతున్నారట. ఇందులో హీరో రెండు పేర్లతో పిలవబడుతుండగా.. వాటిలో ఒకటి 'బైరెడ్డి' అని అంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి రాయలసీమ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నారని తెలుస్తోంది. చిరు ఇందులో పొలిటీషియన్ గా మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాయంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రీమేక్ స్పెషలిస్ట్ గా పిలవబడే మోహన్ రాజా.. తన టీమ్ తో పాటు మెగాస్టార్ చెప్పిన రచయితలతో కలిసి ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తున్న 'ఆచార్య' పూర్తైన తర్వాత ఈ రీమేక్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.