ఫుట్ బాల్ క్లబ్‌ కొనుకున్న చిరు-నాగ్‌

Update: 2016-06-01 08:24 GMT
ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటా చిరంజీవి - నాగార్జున - అల్లు అరవింద్ - నిమ్మగడ్డ ప్రసాద్ లు కలసి తిరుగుతున్నారు అనే విషయంపై ప్రశ్నిస్తూ.. ఇప్పుడు తాజా సచిన్‌ టెండుల్కర్‌ కూడా వీరితో కలిశాడంటే.. వీరందరూ కలసి ఏదో చేస్తున్నారు అంటూ ముందుగానే చెప్పింది తుపాకి.కామ్. ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారో కూడా మేమే వెల్లడిస్తున్నాం.

క్రికెట్‌ కోసం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ను పెట్టినట్లు.. ఫుట్ బాల్ కోసం ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఒకటి పెట్టారు. ఈ లీగ్‌ లో పివిపి సంస్థ.. ఇతర పార్టనర్లతో కలసి ''కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌ బాల్‌ క్లబ్‌'' టీమ్‌ ను కొనుక్కుంది. అయితే లీగల్‌ కేసుల్లో ఇరుక్కోవడం కారణంగా పివిపి తప్పుకున్నారు. ఆ తరువాత కేరళ టీమ్‌ ఏమవుతుంది అంటూ అందరూ ఖంగారుపడుతున్నవేళ.. మేమున్నాం అంటూ ముందుకొచ్చారట తెలుగు స్టార్లు. క్రికెట్‌ లెజండ్‌ సచిన్‌ టెండుల్కర్‌ తో కలసి.. చిరు అండ్‌ నాగ్‌ గ్యాంగ్‌ గతంలో ఎలాగైతే మాటివి లో షేర్‌ కొనుకున్నారో.. ఇప్పుడు ఈ క్లబ్‌ ను కూడా కొనుక్కున్నారు. అబ్బబ్బా.. డబ్బులును సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం అంటే.. చిరంజీవి అండ్‌ నాగ్‌ తరువాతేనబ్బా. పిచ్చెక్కించారు కదూ.

ఇకపోతే ఈ విషయాన్ని స్వయంగా కింగ్‌ నాగార్జున కూడా కన్ఫామ్‌ చేశారు. సచిన్‌ తో కలసి తామందరం క్లబ్‌ కొన్నట్లు ఆయన ఈరోజు ఉదయం తిరుమల దర్శనం చేసుకున్న తరువాత అఫీషియల్‌ గా ప్రకటించారు.
Tags:    

Similar News