బాసూ నీలో ఉంది గ్రేసూ.. దాని ముందు ఇంకేదీ నిలవదులే మెగా బాసూ! .. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొత్త మేకోవర్ చూశాక అభిమానుల ఫీలింగ్ ఇలా ఉంది. చిరు నిత్యయవ్వనుడిగా మారి షాక్ ల మీద షాక్ లిస్తున్నారు. ఇంతకుముందు రాజకీయాల్లోకి వెళ్లాక ఎండనకా కొండనకా వాననకా తిరిగి తిరిగి ఆయన రూపం ట్యాన్ కి గురైంది.
కట్ చేస్తే ఖైదీనంబర్ 150తో కంబ్యాక్ అయ్యేందుకు అతడు ఆయుర్వేదిక్ రిజనవేషన్ సెంటర్ కి వెళ్లారు. డిటాక్సిఫికేషన్ పెద్ద సక్సెసైంది. స్పాలో మొత్తం రూపం మారిపోయింది. చిరు నవమన్మధుడిలా మారిపోయి కనిపించారు. ఖైదీనంబర్ 150 చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు చిరు ఏజ్ 10ఏళ్లు తగ్గిపోయిందంటూ కితాబిచ్చేశారు.
మొన్నటికి మొన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో వీరరసం రౌద్రరసం పండించిన తీరు చూస్తే కుర్రహీరోలకైనా చెమటలు పట్టాల్సిందే అన్నంతగా చెలరేగారు. 60 ప్లస్ లో ఆయన ఇన్ని విన్యాసాలు ఎలా చేయగలుగుతున్నారనేది ఇప్పటికీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లా మారింది.
ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలకు సంతకాలు చేసి మరోసారి ఆశ్చర్యపరిచారు. ఆచార్య చిత్రీకరణ పూర్తయింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ లోనూ యంగ్ గా కనిపించారు. అది కూడా స్పా మహిమే. ఇప్పుడు వెంటనే గ్యాప్ లేకుండా లూసీఫీర్ రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతూ ఇప్పుడిలా కొత్త రూపంతో కనిపించి షాకిస్తున్నారు. విశాఖలో ఆయుర్వేదిక్ స్పా పేరేమిటో కానీ.. చిరుని చూశాక 60 ప్లస్ వాళ్లంతా ఈ స్పాకే క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోందంటూ కితాబిచ్చేస్తున్నారు. తాజాగా వైట్ పోలో టీషర్ట్ డెనిమ్ జీన్స్ ధరించి చిరు ఎంతో స్టైలిష్ గా ఉన్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. వాటీజ్ దిస్ బాసూ నీలో ఉంది గ్రేసూ..! అంటూ తెగ కితాబిచ్చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం అంతర్జాలంలో ట్రెండింగ్ గా మారుతోంది మెగా బాస్ లేటెస్ట్ ఫోటోషూట్.
లూసీఫర్ రీమేక్ టైటిల్ క్యూరియాసిటీ:
లూసీఫర్ రీమేక్ టైటిల్ ని ఇటీవలే ఫిక్స్ చేశారని తెలిసింది. `గాడ్ ఫాదర్` అనే టైటిల్ ని మెగాస్టార్ ఫైనల్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ఇప్పటికే రామ్ చరణ్ `రచ్చ` దర్శకుడు సంపత్ నంది వద్ద ఉండగా మెగా కాంపౌండ్ సంప్రదించింది. చరణ్ స్వయంగా తనకు గాడ్ ఫాదర్ టైటిల్ కావాలని సంపత్ నందిని సంప్రదించారట. తన ఫేవరెట్ హీరో అడగ్గానే మరో ఆలోచనే లేకుండా ఆ టైటిల్ ని సంపత్ నంది ఎంతో ఆనందంగా చిరు కోసం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ని రీమేక్ నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్-చరణ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. మోహన్ రాజాతో లూసీఫర్ రీమేక్ అనంతరం మెగాస్టార్ తదుపరి మెహర్ రమేష్ - బాబి తదితరులతో సినిమాలు చేసేందుకు కమిటైన సంగతి తెలిసినదే. ఇందులో వేదాళం రీమేక్ కి మెహర్ దర్శకత్వం వహించనుండగా.. స్ట్రెయిట్ కథతో బాబి సెట్స్ పైకి వెళతారు.