అప్పటికీ ఇప్పటికీ మెగాస్టార్‌ మారలేదు

Update: 2016-06-30 07:30 GMT
''తెలుగు సినిమా ఇండస్ర్టీకి 20 సంవత్సరాలపాటు మకుటం లేని మహారాజులా పాలించిన ధీరుడు..'' అంటూ హీరో రానా దగ్గుబాటి మొన్నజరిగిన సిని'మా' అవార్డుల కార్యక్రమంలో చెబుతుంటే.. వెంట్రుకలు నిక్కపొడుచుకున్న మాట వాస్తవమే. అయితే మెగాస్టార్‌ మాత్రం అందుకు ఏమాత్రం తీసుపోకుండా కష్టపడుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వన్నెతరగని సేమ్ టు సేమ్ లుక్కుతో పిచ్చ కిక్కిస్తున్నారు.

అదిగో పైన ఆ ఫోటోలను చూస్తున్నారుగా.. అప్పట్లో అంటే 1992లో ముఠామేస్త్రి సినిమా షూటింగ్‌ సమయంలో చైర్లో కూర్చొని ఏదో బుక్‌ ను చదువుకుంటున్న చిరంజీవిని చూడండి. ఆ తరువాత ఇప్పుడు 2016లో మా టివి అవార్డుల కోసం షూటింగ్‌ జరుపుతున్న టైములో ఆయన కూర్చున్న తీరు చూడండి. కేవలం బాడీ లాంగ్వేజే కాదు.. ఆయన లుక్కులు.. చూపుల్లో ఆ హీరోయిక్ నేచర్.. అలాగే ఆ మ్యానరిజమ్ లోని మెగా కిక్‌ అయినాసరే.. చిరంజీవి అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదని చెప్పొచ్చు.

ఇక మొన్న మా టివి అవార్డుల్లో డ్యాన్సులు కూడా బాగానే వేశారు కాబట్టి.. ఖచ్చితంగా తన 150వ సినిమాలో కూడా అదే రేంజులో డ్యాన్స్ వేస్తారని అనుకోవచ్చు. ఆల్రెడీ కత్తి రీమేక్‌ షూటింగ్‌ మొదలైంది కాబట్టి... ఇక రిలీజే తరువాయి.
Tags:    

Similar News